-
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
వయస్సుతో పాటు వంట్లో కొవ్వు పెంచుకుని నోటికొచ్చినట్టు మాట్లాడున్నాడని ఆగ్రహం
ఏపీలో ఏ2 గ్యాంగ్ అటు ఓడరేవులు, ఇటు రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు, భూకబ్జాలతో చెలరేగిపోతోంది. అక్రమాలు, అరాచకాలతో ఏ2 నుంచి 1గా మారుతున్న ఆయనకు వయస్సుతో పాటు వంట్లో ఫాట్ కూడా ఎక్కువైపోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో ఇంకా బయట ఎలా ఉన్నారో అర్థం కాని పరిస్థితి.
ఒక రోజేమో తిరుమల వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడి ఇంటి దొడ్లో, పెరట్లో ఉందని మాట్లాడాడు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది..పింక్ డైమండ్ అనేది టీటీడీకి లేదని ఈఓ స్పష్టం చేశారు..అప్పుడు ఎవర్ని బొక్కలో వేయాలి
ఓ వైపు అరబిందో ఫౌండేషన్ పేరుతో దోపిడీ, మరోవైపు విశాఖలో భూకబ్జాలు చేసిన ఏ2లో వయస్సుతో పాటు ఫాట్ కూడా పెరుగుతోంది. ఆ కొవ్వు ఎక్కువై చేస్తున్న పనులతో మొన్న కూడా మరో కేసులో ఏ2గా బుక్ అయ్యాడు.
కాకినాడ ఓడరేవు ద్వారా రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల్లోనూ ఏ2 హ్యాండే..ప్రతి అక్రమ వ్యవహారంలోనూ ఆయన పాత్రే.ఏ2కి సంపాదించింది సరిపోవడం లేదు..జగన్ రెడ్డితో కలిసి 16 నెలలు జైల్లో ఉండి దోపిడీలో మరింత అనుభవం సంపాదించాడు.ఒక్క పింక్ డైమండ్ కేసులోనే ఏ2ని బొక్కలో వేయవచ్చు..మా ప్రభుత్వం ఇంకా ఎందుకు స్పేర్ చేస్తుందో అర్థం కావడం లేదు.
విజయసాయి రెడ్డి అడ్డగోలు వాగుడును మేం జీర్ణించుకోలేక పోతున్నాం..డీజీపీ ఏం చేస్తున్నారో. ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. విజయసాయి రెడ్డి బతుకంతా అవినీతి, దోపిడీ, అరాచకం. అటువంటి వాడు ఓ ముఖ్యమంత్రిని మర్యాదలేకుండా క్రూరంగా మాట్లాడుతుంటే ఎందుకు సహించాలి.
విజయసాయిరెడ్డి స్వగ్రామం మా సర్వేపల్లి నియోజకవర్గంలోని తాళ్లపూడి..కానీ ఆయన ఎవరికీ తెలియదు..ఒక్క ఏ2గా మాత్రమే తెలుసు. విజయసాయి రెడ్డి రాజకీయ పరిచయమే ఏ2గా జరిగింది. అటువంటి చరిత్ర కలిగిన ఏ2ని పోలీసులు ఉపేక్షించాల్సిన అవసరం లేదు. చట్టప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న వారిపై పోలీసులు ఇప్పటికే చర్యలకు ఉపక్రమించారు..మరి ఏ2కి మినహాయింపు ఎందుకో…