Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ప్రభుత్వానిది సంక్షేమం కాదు క్షామమే

– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

విజయవాడ..పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో ని ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్ లో మధ్యాహ్నం భోజనం పథకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పరిశీలించారు. ఆయన వెంట మహిళామోర్చా రాష్ట్ర నాయకురాళ్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడి గుడ్డు సైజుతో పాటు, ఫుడ్ మెటీరియల్ ను కూడా సోమువీర్రాజు పరిశీలించి, ఇతర వివరాలను అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు .భోజన వితరణ ఎలా ఉందన్న విషయం కూడా విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఫొటోలు ముద్రించుకునే అన్ని సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం అమలుచేస్తున్నవే అందువల్ల భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోటో కూడా ముద్రించాలని డిమాండ్ స్తున్నానన్నారు. అంగన్వాడీ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం ఎందుకు పెట్టడం లేదు.పౌష్టికాహారం లోపం లేకుండా తల్లి,బిడ్డలకు కేంద్ర ప్రభుత్వం బలామృతం పంపిణీ చేస్తుంది. సిపిడివోలు,సూపర్వైజర్లు పాఠశాలలో భోజనం ఎలా ఉందో పరిశీలించడం లేదు. కనీసం స్థానిక ఎమ్మెల్యేలు వచ్చి పరిశీలించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత కంటే స్టిక్కర్లకు ప్రయారిటీ ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలో పిల్లలకు,పాలు గుడ్లు అందించడం లేదు. డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్టికర్లు వేసుకుంటుంది. Icds పాఠశాలల్లో సచివాలయాలు ఎలా ఏర్పాటు చేస్తారా అంటూ మండిపడ్డారు.

Nregs నిధులతో అంగన్వాడీలు నిర్మిస్తే వాటిలో సచివాలయంలో ఎలా పెడుతున్నారని ప్రశ్నించారు.సంక్షేమం పేరుతో అన్నిటికీ అప్పులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమం చేస్తున్నా అప్పులు చేయడం లేదు. మీరు అభివృద్ధి చేసేది సున్నా,అప్పులు చేసేది ఎక్కువ. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇస్తున్న ఆహారం నాణ్యత పైద్రుష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కనీస సైజులేని కొడిగుడ్డు పెడుతున్నారని అరోపించారు పోషణ్ అభియాన్ అనేది జాతీయ పోషకాహార కార్యక్రమంలో భాగంగా జాతీయ స్ధాయిలో అమలు చేయడం జరుగుతోందన్నారు. 2018 సంవత్సరం నుండి ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతోందన్నారు. బాలలకు పోషక విలువలు పెంచడానికి కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. గర్భిణీలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం జరుగుతోందన్నారు.

రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి. జిల్లా మహిళా అధ్యక్షురాలు కుసుమ్ దోషి, మహిళా మోర్చా ఇంఛార్జి విజయలక్ష్మి పండిట్, ప్రధాన కార్యదర్శులు బొమ్మదేవర రత్న కుమారి, చిగురుపాటి లక్ష్మి, యర్రా లక్ష్మి, స్వాతి, ఇమ్మిడిశెట్టి సుమతి, నాగలక్ష్మి, బిజెపి జిల్లా అధ్యక్షుడ బబ్బూరి శ్రీరామ్, డాక్టర్ దాసం ఉమా మహేశ్వర రాజు, KS ఆర్ముగం, పోతురెడ్డి వెంకట్, మొగంటి వీరబాబు, మాచర్ల శ్రీనివాస్, యర్ర రవి చౌదరి, యాతం తారా కృష్ణ, కదం శ్రీనివాస్ రావు. తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE