Suryaa.co.in

Andhra Pradesh

పూజకు ఫీజులా ?

– బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఆగ్రహం

హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే వినాయక చతుర్థి నవరాత్రుల కార్యక్రమానికి పందిళ్లు వేసుకుని వినాయక చవితి చేసుకునే భక్తులు /ప్రజలు, రోజువారి రుసుము రూ.1000/- చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా నిబంధన విధించడం ద్వారా ఉద్దేశపూర్వకంగానే వినాయక చవితి పండుగను నవరాత్రుల నుండి ఒకరోజు జరుపుకునే విధంగా కుట్రపూరిత చర్యలను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు.

వినాయక చవితి పండుగను వాడవాడలా గ్రామ గ్రామాన వీధి వీధినా ప్రజలందరూ కలసి ఐకమత్యంతో జరుపుకునే పండగకు ఫీజులు వసూలు చేయటం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం హిందూ ధర్మంపై గౌరవం లేదని, హిందువుల పండగలపై బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని సోము వీర్రాజు మండిపడ్డారు.

పూజకు ఫీజులా ? అంటూ వైసిపి ప్రభుత్వ వైఖరిని నిలదీస్తూ, వైసీపీ ప్రభుత్వ హిందూ వ్యతిరేక భావాన్ని వీడకపోతే బిజెపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గత సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను కరోనా పేరుతో నిలువురించే ప్రయత్నం చేసిన వైసీపీ ప్రభుత్వం బిజెపి ఆందోళనలతో దిగి వచ్చిందని ఈ సంవత్సరం కొత్త ఎత్తుగడలతో వినాయక చవితి ఉత్సవాలను జరపకుండా నిలువురించే యత్నాలను చూస్తూ ఊరుకోమని, పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిజిపి వెంటనే రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించే నిర్వాహకులకు ఎటువంటి ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా సింగల్ విండో సిస్టం ద్వారా, ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా అనుమతులను వెంటనే మంజూరు చేసి శాంతియుతంగా ఉత్సవాల నిర్వహించుకునే అవకాశం కల్పించాలని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE