– సోము వీర్రాజు
అమరావతి:-ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ‘‘ప్రభుత్వం మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేస్తానంటోంది. ఈ మేరకు జిల్లాల పెంపు విషయంలో ప్రజాభిప్రాయం సేకరించాలి. కమిటీ వేసి ప్రజల కోరికను ప్రభుత్వం తెలుసుకోవాలి’’ అని తెలిపారు.మరోవైపు బస్టాండ్‌కు దిక్కులేదంటే.. వైకాపా నేతలు జిల్లాకో విమానాశ్రయం అంటున్నారని సోము వీర్రాజు విమర్శించారు