Home » పోలీసులూ…. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

పోలీసులూ…. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

– నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి కేసీఆర్
– తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్

నందిపేటలో : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ నాయకులు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తనను గెలిపించిన ప్రజల కష్టా సుఖాల్లో అండగా ఉండాలని, తన ఎంపీ నిధులను వెచ్చించి గ్రామాలను అభివ్రుద్ధి చేసేందుకు వెళ్లిన అరవింద్ పై దాడి హేయం.పాతబస్తీ గడ్డ మీద గర్జించి కొట్లాడిన పార్టీ బీజేపీ….అనే సంగతిని గుర్తుంచుకోవాలి. మొన్న నాపై పోలీసులు దాడి చేశారు… ఈరోజు అరవింద్ పై దాడి చేశారు. గతంలోనూ నల్గొండలో దాడి చేశారు.

సీఎం కేసీఆర్ నిరాశలోకి వెళ్లిపోయారు…. అందుకే అసహనంతో దాడులు…1400 మంది బలిదానాలతో తెలంగాణ వచ్చింది ఎందుకు? దాడులు చేయడానికా?రుణమాఫీ చేయలేదు… దళిత బంధు అమలు
sanjay చేయలేదు… ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భ్రుతి ఇవ్వలేదు.. మరి హామీలు నెరవేర్చని మీపై దాడులు చేయాలా?తప్పు చేస్తే ప్రశ్నించడమే పాపమా? సాక్షాత్తు రాష్ట్ర సీఎం దాడులు చేయాలంటూ పురిగొల్పుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమిటి? మా సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్దం. దాడులు బీజేపీకి కొత్త కాదు…. ఎన్నో త్యాగాలు చేసి పార్టీ.

నక్సలైట్ల చేతిలో చస్తామని తెలిసి కూడా జనం కోసం త్యాగాలకు వెనుకంజ వేయని కార్యకర్తలు బీజేపీకి సిద్ధం.కేసీఆర్…. నువ్వు, నీ కుటుంబ సభ్యులు చేసిన త్యాగమేంది? నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి కేసీఆర్. తెలంగాణలో ప్రజస్వామ్యం బతకాలంటే ఈసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నరు.ఇది తెలిసి ఓర్వలేక, అసహనంతో కేసీఆర్ బీజేపీ నేతలపై దాడులకు పురిగొల్పుతున్నరు.మనపై మనం దాడి చేయడానికేనా తెలంగాణలో 1400 మంది బలిదానం చేసింది? నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలని…. నిరుద్యోగ భ్రుతి కోసం… డబుల్ బెడ్రూం కోసం, రుణమాఫీ కోసం, ధాన్యం కొనుగోలు కోసం… 317 జీవోను సవరించాలని కోరుతూ బీజేపీ ఎన్నో ఉద్యమాలు చేస్తోంది.

ప్రజలు కూడా తెలంగాణలో మార్పు కోరుకుంటున్నరు…. మా పోరాటాలకు తట్టుకోలేక, ప్రజలు ప్రశ్నించడాన్ని సహించలేకే కేసీఆర్ ఇలాంటి దాడులు చేయిస్తున్నారు. ప్రజల కోసం మేం దాడులు భరించడానికి సిద్ధంగా ఉన్నాం…. మూర్ఖపు కేసీఆర్ పాలన నుండి ప్రజలను విముక్తి చేయడానికి మేం ఏ త్యాగానికైనా సిద్ధం.మేం దాడులకు పాల్పడితే… కేసీఆర్ బిస్తర్ సర్దుకుని పోవాల్సిందే… ఉద్యోగులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కేసీఆర్ శవయాత్ర చేస్తే భయపడి పారిపోయిన సంగతి మర్చిపోయినవా?

పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నువ్వు ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలేదు? పార్లమెంట్ లో బీజేపీ తెలంగాణ బిల్లుకు మద్దతివ్వకపోతే… ఈనాడు సీఎం సీటులో కూర్చునే వాడివి కాదనే సంగతి

కేసీఆర్ గుర్తుంచుకోవాలి.కేసీఆర్…. నువ్వు తెలంగాణలో అధికారంలో ఉంటే…. మేం కేంద్రంలో అధికారంలో ఉన్నామనే సంగతి తెలుసుకో. ఎంపీ అరవింద్ పై జరిగిన దాడిపైనా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం. పోలీసులూ…. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే… కేసీఆర్ మాటలు వింటే నష్టపోతారు.

రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ లు చాలా బాధపడుతున్నారు. తమతోటే చట్ట వ్యతిరేక పనులు చేయిస్తున్నారంటూ… చాలా మంది ఐపీఎస్ లు బాధపడుతున్నారు. ఎంపీ అరవింద్ పై దాడి జరుగుతుందని ముందే డీజీపీకి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ లకు తెలుసు. రక్షణ కల్పించాల్సిన పోలీసుల ఆధ్వర్యంలో సీఎం డైరెక్ష న్ లో స్వయంగా దాడులు చేయించడం దారుణం.

అరవింద్ పై జరిగిన దాడి ముమ్మాటికీ నిజామాబాద్ సీపీకి తెలిసి జరిగిన హత్యా యత్నమే.ఎంపీ అభివ్రుద్ధి పనుల్లో పాల్గొంటే తప్పా?ఎంపీపై దాడి జరిగితే సీఎం స్పందించరు… డీజీపీ, సీపీ మాట్లాడలేని దుస్థితి. ఎంపీపై కత్తులతో, కర్రలతో దాడులు చేసి హత్యాయత్నం చేస్తే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం సిగ్గుచేటు.

టీఆర్ఎస్ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బీజేపీ కార్యకర్తలు చేసిన తప్పేంది? దాడులు చేసిన వాళ్లంతా గుండెమీద చేయి వేసుకుని ఆలోచించండి…. మీకూ కుటుంబ సభ్యులున్నారు… మీపై దాడులు జరిగితే వాళ్లు ఎంత బాధపడతారో ఆలోచించండి. దాడులు చేసిన వాళ్లంతా బయట తిరుగుతుంటే
sanjay1
పోలీసులు ఏం చేస్తున్నరు?రేపు బీజేపీ నేతలపైనే ఉల్టా కేసులు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నిజాం పాలనలోనూ ఇంతటి నిర్బంధాలను చూడలేదని ప్రజలు భావిస్తున్నరు. గవర్నర్ వ్యవస్థను గౌరవించలేని సంస్కార హీనులు టీఆర్ఎస్ నేతలు. మీ అవినీతి, అక్రమాలు బయటకొస్తున్నయ్… సాక్షాత్తు మంత్రిగా ఉంటూ ఎన్నికల కమిషన్ కు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారిపై విచారణ మొదలైంది.

కేసీఆర్…. మీ మంత్రులు, ఎమ్మెల్యేలను హద్దుల్లో ఉంచుకో. మమ్ముల్ని రెచ్చగొడితే ఊరుకునే ప్రసక్తే లేదు. గెలిచిన వాళ్లంతా ప్రజల కోసం పనిచేయాలనే ఓట్లేశారనే సంగతిని విస్మరిస్తే తగిన గుణపాఠం చెబుతారు.సీఎం…. మీకు మానవత్వం ఉంటే ఈ దాడిని ఖండించాలి. ఈ దాడికి పాల్పడ్డ వారిని,
sanjay2 అందుకు సహకరించిన సీపీపై వెంటనే కేసు నమోదు చేయాలి.అరవింద్ పై జరిగిన దాడి సమాచారం అందుకున్న వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఫోన్ చేసి బాసటగా ఉన్నట్లు తెలిపారు.

జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు.బీజేపీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు. ప్రజల కోసం తెగించి కొట్లాడదాం… మీకు అండగా మేమున్నాం. తెలంగాణ రైతులెవరూ కత్తులతో దాడులు చేయరు. ఆ సంస్క్రుతి తెలంగాణ రైతాంగానికి లేదు.

టీఆర్ఎస్ గూండాలే ఎంపీపై దాడులకు తెగబడ్డారు. పంజాబ్ లో కూడా ప్రధాని కాన్వాయ్ పై దాడులకు తెగబడింది ఖలిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే. ఇదే విషయాన్ని ఖలిస్తాన్ తీవ్రవాదులు ప్రకటించారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తారే తప్ప దాడులు చేయరు.దేశానికి తెలంగాణ రైతాంగం ఓ తలమానికం.

Leave a Reply