-ప్రాజాపోరు కార్యక్రమంలో గిరిపుత్రుల గోడు
-సోషియో ఎకనమిక్ సర్వే ఎందుకు బయటపెట్టడం లేదు?
– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
అమరావతి: పోలవరం విలీన మండల కేంద్రం కునవరంలో నిర్వహించిన ప్రాజాపోరు కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుకు గిరిపుత్రులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
పోలవరం పునరావాస ప్యాకేజీ అమలులో అసలు లబ్బిధారుల జాబితాలో అవకతవకలకు పాల్పడి అమాయక గిరిపుత్రుల నోట్లో మట్టి కొట్టి , నోట్లు కట్టలు కూడబెట్టుకునేందుకు మనసు ఎలా వచ్చిందో నని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పాలకులు సర్వే నివేదిక ఇస్తే నిధులు ఇవ్వడానికి కేంద్రం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను కేంద్రానికి ఎందుకు సమర్పించడం లేదు? సోషియో ఎకనమిక్ సర్వే ఎందుకు బయటపెట్టడం లేదు? సోషియో ఎకనమిక్ సర్వే కేంద్రానికి పంపకుండా సంవత్సరాల తరబడి కాలయాపన చేసి, వారికి అవసరమైనప్పుడు కేంద్రాన్ని ఏదో అడుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం డ్రామా అడుతోందని విమర్శించారు. అసలు నిజాలు ప్రజలకు తెలియనివ్వకుండా ఉండేందుకు మాత్రం తెలుగుదేశం, వైసీపి కూడా కలసి నాటకం అడుతూ నెపం కేంద్రం పై నెట్టేందుకు మాత్రం తెరచాటు స్నేహం ఈరెండు పార్టీలు చేస్తున్నాయని సోమువీర్రాజు దుయ్యబట్టారు.
నివేదిక ద్వారా అసలు లబ్బిదారుల జాబితా బయటకు వస్తే అక్రమాలు బయటపడతాయని ఈ కుటుంబ పార్టీలకు భయం పట్టుకుంది. తక్షణమే పోలవరం ముంపు మండలాల ప్రజల సామాజిక ఆర్ధిక సర్వే నివేదికను బయటపెట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు.
నా దగ్గర డబ్బులు లేవు కేంద్రం ఇస్తే తప్ప మనం ఏమి చేయలేము లాంటి కుంటి సాకులు చెప్పేకంటే, ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని సోము వీర్రాజు స్పష్టం చేశారు