Suryaa.co.in

National

మన్మోహన్ సింగ్,పార్ధివ దేహానికి సోనియా, రాహుల్ గాంధీ ఘన నివాళి

మన్మోహన్‌కు సోనియా రాహుల్ నివాళి

ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పార్థివ దేహానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకులు సోనియా గాంధీ, మల్లిఖా ర్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యు లకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ‘‘మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అపార మైన జ్ఞానం, సమగ్రతతో భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. ఆయనలోని వినయం, ఆర్థికశాస్త్రంపై ఆయనకున్న లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చాయి. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఓ గురువును కోల్పోయాను’’ అని అన్నారు.

అలాగే, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఆమె ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా సైతం మన్మోహన్‌ సింగ్ నివాసానికి చేరుకుని ఘన నివాళులర్పించారు. మీడియాతో రాబర్ట్‌ వాద్రా మాట్లాడుతూ.. మన్మోహన్‌ సింగ్ ఎల్లప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేసే వారని చెప్పుకొచ్చారు. ఆర్థిక రంగంలో అనేక విషయాలపై ఆయనకు చాలా పరిజ్ఞానం ఉందని పేర్కొన్నారు. ఇకపోతే, మన్మోహన్‌ సింగ్‌ యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పని చేశారని గుర్తు చేశారు.

LEAVE A RESPONSE