Suryaa.co.in

Andhra Pradesh

త్వరలో జన్మభూమి-2

  •  అతి త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ

  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

అమరావతి: జన్మభూమి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

గురువారం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జన్మభూమి-2 కార్యక్రమం మొదలు కానున్నట్లు తెలిపారు. జన్మభూమి 2 కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పొలిట్‌బ్యూరో లో 55 రోజుల పాలనపై చర్చించినట్లు తెలిపారు. నామినేటెడ్ పోస్టులు అతి త్వరలో భర్తీ చేస్తామని, ఇసుకలో అక్రమాలు సహించబోనని అధినేత చంద్రబాబు మరోసారి హెచ్చరించారన్నారు. వర్షాలతో ప్రాజెక్టులన్ని నిండుకుండలా ఉన్నాయన్నారు. ప్రాజెక్టులు నిండటంతో జగన్ గుండె నీరుకారుతోందని విమర్శించారు.

జనాభా నియంత్రణ వలన డీలిమిటేషన్‌లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందన్నారు. ఒక యూపీలో 140 పార్లమెంటు స్థానాలు వస్తే దక్షిణ భారతదేశం 160 మాత్రమే ఉంటాయన్నారు. జనాభా తగ్గడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోతాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణాలో టిడిపి పార్డీ బలోపేతంపై దృష్టి

తెలంగాణాలో టిడిపి పార్డీని బలోపేతంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. టీడీపీ పార్టీ సభ్యత్వం రుసుము రూ.100 తో ప్రారంభిస్తామని, సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షలు వచ్చే విధంగా పరిహారం ఉండాలని నిర్ణయించారు.

పేదరిక నిర్మూలనపై ప్రధానంగా చర్చ జరిగింది. త్వరలో పేదరిక నిర్మూలనపై విధివిధానాలు రూపొందిస్తామని సమావేశంలో నిర్ణయించారు. విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని నిర్ణయించారు. ఎస్సీ వర్గీకరణకు జిల్లాను యూనిట్‌గా తీసుకుంటామని సమావేశంలో చర్చించారు.

LEAVE A RESPONSE