-100 పడకలకు పెంచుతూ వెలువడనున్న జీవో
-తొర్రూరు హాస్పిటల్‌లో మార్చురీ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, -గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తొర్రూరు (మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం), మే 9ః తొర్రూరు హాస్పిటల్ ను త్వరలోనే 100 పడకలకు అప్ గ్రేడ్ చేస్తున్నామని, జీవో కూడా రానున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. తొర్రూరు ప్రభుత్వ దవాఖానాలో రూ.12 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన మర్చురీ ని మంత్రి మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొర్రూరు పట్టణ అభివృద్ధి, అవసరాలకు తగ్గట్లుగా హాస్పిటల్ ను 30 పడకల నుండి 100 పడకలకు అప్ గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు. జీవో కూడా త్వరలోనే వెలువడుతుందని అన్నారు. ప్రభుత్వం విద్యా, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, అందుకు తగ్గట్లుగా జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు.
వరంగల్ లోనూ ఎంజిఎం హాస్పిటల్‌ను ఆధునీకరించామని, పిఎంఎస్ ఎస్ వై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తోడుగా రూ.11 వందల కోట్లతో మరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. వరంగల్ ను హెల్త్ హబ్ గా తయారు చేస్తున్నామని చెప్పారు.