మేం మనుషులం కాదు,
మాకింకో పేరేదో ఉంది!
ఝార్ఖండ్ లోని గర్వా జిల్లాలోని బిష్ణుపుర పోలీస్ స్టేషన్ లాకప్ లో గత రెండురోజులగా కేవలం చెడ్డీతో కూర్చొని ఉన్న ఆ వ్యక్తి పేరు జీన్ డ్రీజ్.భారత సంతతికి చెందిన బెల్జీయం దేశస్థుడు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆర్ధిక వేత్త, రచయిత, అధ్యాపకుడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎసెక్స్ యూనివర్సిటీలో మేధమేటికల్ ఎకనామిక్స్ లో పి.ఎచ్. డీ. చేశారు.ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో, ఢిల్లీ
స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు. రాంచీ యూనివర్సిటీ లో ఎకనామిక్స్ గౌరవ ప్రొఫెసర్ గా వున్నారు. భారత దేశ ఆర్ధిక వ్యవస్థపై ఎంతో అధ్యయనం చేసిన ఆయన నోబెల్ విజేత ఆమర్థ్యసేన్ తో కలిసి రాసిన హాంగర్ ఆఫ్ పబ్లిక్ యాక్షన్(1989, అక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురణ) పుస్తకం ఎన్నో అవార్డులు, రివార్డుల నందుకుంది. ఆన్ సరటైన్ గ్లోరీ- ఇండియన్ కాంట్రడిక్షన్స్ మరో గొప్ప గ్రంధం.
ఆయన కొన్నేళ్లుగా “రైట్ టు ఫుడ్ ” యాక్టివిస్ట్ గా మనదేశంలో ఉద్యమం చేస్తున్నారు. కేవలం బతికుండటం కోసం పిడికెడు ఆహారం హక్కు కోసం చేపట్టిన ఉద్యమం అది.ఆదివాసీల హక్కుల కోసం అంకితం అయినందుకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుధా భరద్వాజ ని అరెస్ట్ చేసి రాజద్రోహం కేసు పెట్టిన ఝార్ఖండ్ ప్రభుత్వం ఆహార హక్కు కోసం గొంతెత్తిన జీన్ డ్రీజ్ తో పాటు మరో ఇద్దరు కార్యకర్తలతో కలిసి అరెస్ట్ చేశారు. కేవలం అనుమతి లేకుండా మీటింగ్ పెట్టారు అనే సాకుతో బిష్ణుపుర పోలీస్ స్టేషన్ లాకప్ లో పెట్టి పోలీస్ లాఠీ దెబ్బల రుచి చూపించారు. ఏమి కేసు పెట్టబోతున్నారో మోడీ కె తెలియాలి.
మన్నించు జీన్!
మేం ఖాళీగా లేం
ఎన్నికల గోదాలో మమ్మల్ని
మేం పారేసుకున్నాం.
మేమిప్పుడు మనుషులను,
ముఖ్యంగా మానవత్వం ఉన్న
వాళ్ళని గుర్తించడం మానేసాం.
మేమిప్పుడు మనుషులం కాదు,
మాకింకో పేరేదో ఉంది.
-మోహన్ సుందరం