దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ అర్. ధనంజయులు తుఫాను పరిస్థితుల దృష్ట్యా పాటించాల్సిన జాగ్రత్తలపై విజయవాడ, గుంటూరు మరియు గుంతకల్లు డివిజన్లతో వివిధ విభాగాల ప్రిన్సిపల్ హెడ్స్ తో పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. రైలు కార్యకలాపాలకు భద్రత కల్పించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
ఇందులో భాగంగా అదనపు జనరల్ మేనేజర్ తుఫాను పరిస్తితిని సమీక్షించారు మరియు వివిధ ప్రదేశాలలో తుఫాను పరిస్థితులు ఎదూరుకునేందుకు సరిపడే విధంగా స్టాక్ ను అమార్చుకోవాలని సూచించారు. నిరంతర పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని రైల్వే అధికారులకు సూచించారు. తూఫాను గమనాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ సరిపడు చర్యలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రభావితమయ్యే సెక్షన్లలో మాన్సూన్ పెట్రోలింగ్ చేపట్టవలసిందని సూచించారు. బ్రిడ్జీల దగ్గర మరియు ఇతర ప్రభావిత ప్రదేశాలలో వాచ్‌మెన్‌లను నియమించాలని సూచించారు.
దీనికి అదనంగా బ్రిడ్జిల కింద ఇబ్బందికరమైన రోడ్డులో వాచ్‌మెన్‌లను నియమించాలని, నిలిచిపోయిన నీటిని పంపింగ్ చేయడానికి డీజిల్ పంపులను ముందుగానే అమర్చాలని, హాని కలిగించే ప్రదేశాలలో ఇసుక సంచులు & బ్యాలస్ట్ బ్యాగ్‌ల స్టాక్‌ను తగిన సంఖ్యలో నిర్వహించాలని మరియు పరిస్థితులను క్లియర్ చేయడానికి కటింగ్ పరికరాలను సిద్ధంగా ఉంచాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. పెద్ద వృక్షాలు ట్రాక్‌లో పడిపోతున్న నేపథ్యంలో మాన్‌సూన్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, అన్ని బలహీనమైన వంతెనలు మరియు ప్రదేశాలలో అధికారులందరూ నైట్ ఫుట్‌ప్లేటింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించారు.
తుఫాను నేపథ్యంలో రైలు ప్రయాణికులకు సూచన:
తుఫాను పరిస్థితి కారణంగా భారీ వర్షాలు, రాబోయే తీవ్రమైన తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులోని దక్షిణ కోస్తా ప్రాంతంలో తుఫాను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, రానున్న రెండు రోజుల్లో ఈ ప్రాంతంలో రైలు సర్వీసుల సరళిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. రైలు కార్యకలాపాలు మరియు ప్రయాణీకుల భద్రత దృష్ట్యా. దక్షిణ మధ్య రైల్వే మీదుగా తీర ప్రాంతంలో భారీ వర్షాలు, వేగంతో గాలులు వీచే అవకాశం రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపుతుంది.
ప్రభావిత సెక్షన్‌లలో నడపాల్సిన రైలు సర్వీసులను ఈ కాలంలో మార్చే అవకాశం ఉంది. పరిస్థితికి అనుగుణంగా అవి దారి మళ్లించబడతాయి, రీషెడ్యూల్ చేయబడతాయి, పాక్షికంగా రద్దు చేయబడతాయి లేదా రద్దు చేయబడతాయి.
పై పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైలు ప్రయాణికులు తమ రైలు ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అభ్యర్థించారు. అలాగే వారి ప్రయాణాన్ని చేపట్టే ముందు రైళ్ళు నడుస్తున్న వాస్తవ స్థితి గురించి రైల్వే అధికారుల నుండి తెలుసుకోవచ్చు. ఈ కాలంలో ఏదైనా రైలు సంబంధిత విచారణ కోసం, ప్రయాణికులు దయచేసి సమీపంలోని రైల్వే స్టేషన్‌లోని అధికారులను సంప్రదించగలరు.