దక్షిణాది సీఎంలలో ఏ ఒక్కరి సామర్ధ్యంతోనూ పోటీ పడలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది….మన మోదీయే!
మోదీ వర్సెస్ కేసీఆర్
ఒక ప్రచ్చన్న పరోక్ష
వాట్ ఎవర్ ఇట్
వార్ ఒకటైతే నడుస్తోంది
ఈ యుద్ధంలో మోదీని చూస్తే
కేసీఆర్ కి జ్వరమనీ
గరమనీ చాలానే కామెంట్లు వినిపించాయి
నిజంగా మోదీ గొప్పోడా
లేక కేసీఆరా?
ఆ మాటకొస్తే
దక్షిణాది సీఎంలలో
ఒక కేసీఆర్ కావచ్చు
జగన్ కావచ్చు
స్టాలిన్ కావచ్చు
పినరయ్ విజయన్ కావచ్చు
అంతెందుకూ..
ఆయన పార్టీకి చెందిన సీఎం
కన్నడ కమల కస్తూరి యడ్యూరప్ప కావచ్చు
వీళ్లలో ఏ ఒక్కరితోనైనా
మోదీకి పోలిక ఉందా?
మోదీ ఎదిగి వచ్చిన తీరు..
కేసీఆర్- జగన్- స్టాలిన్- వాళ్ల నాన్నకరుణానిథి
ఆయన ప్రత్యర్ధి- జయలలిత- ఆమె కన్నా ముందు అన్నా డీఎంకే అధినేత-ఎంజీఆర్
వీళ్లలో ఏ ఒక్కరితోనైనా మోదీ ఎదురు నిలిచే దమ్మూ ధైర్యం సామర్ధ్యం ఉందా?
అని చూస్తే భారత రాజకీయ రంగ చరిత్రలోనే ఆ స్కోప్ ఎక్కడా కనిపించదు.
నిజానికి కేసీఆర్
2000లో నిద్రాణమైన తెలంగాణ వాదాన్ని తట్టి లేపి
దాన్ని మహోజ్వలంగా మలచి
ఒకానొక దశలో తాను సైతం ప్రాణాలకు తెగించి
కొట్లాడి రాష్ట్రాన్ని కొని తేవడం మాత్రమే కాదు
తనతో పాటు ఎందరికో పదవులు తీసుకొచ్చిన పెట్టిన ఘనుడు.
తన ఇంట్లో నలుగురికి పదవులు రావడం
మంత్రుల్లో అత్యధికులు రెడ్లున్నారన్న పేరుండటం
ప్రస్తుతం ఆయన మంత్రి వర్గంలో ఉన్న మంత్రులెవరూ
తెలంగానం వినిపించిన వారు కారన్న విమర్శలుండటం
ఫామ్ హౌస్ సీంగా పేరుండటం
వంటివి అలా ఉంచితే
ఇవన్నీ తన సొంత కష్టార్జితంతో సాధించినవే.
ఇక్కడ ఏ ఒక్క ఘనతా ఆయన ఇతరుల ఆధారంగా దేబిరించి లఫంగి లుచ్చా పనులు చేసి సాధించినవి కానే కావు.
బూట్లు నాకి తీసుకొచ్చినవి కావు.
వాళ్లకీ వీళ్లకీ వంగి వంగి దండాలు పెట్టి పొందినవి కావు.
ఒక అనుచరుడిలా వెనక నిలబడి గొడుగు పట్టి
ఆ వినయ విదేయతలతో సాధించుకున్నవి కానే కావు..
ఇక జగన్ కూడా తన తండ్రి ఉన్న పార్టీలో ఉండి
ఎప్పుడో ఎక్కడో అయాచితంగా వచ్చే పదవులతో సరి పెట్టకుండా
ధైర్యంగా బయటకొచ్చి తొలి పోటీలో గౌరవ నీయ ప్రతిపక్షంగా నిలిచి
నువ్వు కొట్టే దెబ్బ నేను తీసుకుంటున్నా
నా టైమస్తది నేనూ కొడతానని మాటిచ్చి
ఆ మాట నిలబెట్టుకుంటున్న ఒకే ఒక్కడు ఒన్ అండ్ ఓన్లీ
నలభై ఏళ్ల చంద్రబాబు దిమ్మ తిరిగి మైండ్ బ్లాకయ్యేలా
151 సీట్లతో అఖండ విజయం సాధించిన ఘనుడు.
తన తండ్రికన్నా మించి పాదయాత్ర చేసి
ప్రతి ఒక్కరి గోడు విని వారిలోని ప్రతి ఒక్కరికీ పేరు పేరునా సంక్షేమ ఫలాలను అందిస్తున్న పరిపాలకుడు
ఇలాళ జగన్ ప్రతి దానికీ కోర్టు ఆటంకాలను ఎదుర్కుండవచ్చుగాక…
HE IS ద లెజండ్.
సొంత కాళ్లపై నిలబడ్డ యోధాను యోధుడు.
ఆ మాటకొస్తే ఆయన తండ్రి వైయస్సార్ కూడా అంతే.
చంద్రబాబుకు వచ్చినట్టు అయాచితంగా ముఖ్యమంత్రి పదవి రాలేదు.
ఎంతో కష్టపడి పాదయాత్రలు చేసి జనం మెప్పు పొంది
ఆ తర్వాత ప్రజానాయకుడిగా ఎదిగి అత్యున్నత పదవి పొందాడు.
ఇక మన పొరుగు రాష్రం తమిళనాడులో ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కావచ్చు.
ఆయన తండ్రి కరుణానిథి కావచ్చు.. కరుణ ఆపోనెంట్ జయలలిత కావచ్చు.
వీళ్లది కూడా క్షణక్షణం పోరుబాటే..
వీళ్లు ఏ శనివారం నాడు పుట్టారో తెలీదుకానీ
శనివారమని ఎందుకంటున్నానంటే
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక నమ్మకముంది
శనివారం పుట్టిన వాళ్లకు ప్రతిదీ ఎంతో కష్ట పడితే గానీ రాదంటారు.
సరిగ్గా ఇలాగే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సీఎంలు
ఎంతో శ్రమిస్తే కానీ ఆయా అత్యున్నత పీఠాలను అధిరోహించలేదు.
నాకు మోదీ కన్నా వెయ్యి రెట్లు యడ్యూరప్ప గొప్పోడనిపిస్తాడు.
ఎందుకంటే ఇక్కడ కమలం పువ్వు పూయడానికి అస్సలు ఆస్కారమే లేదు.
అయినా సరే ఇక్కడొక హిందుత్వ కొలను గుర్తించి
అందులో కమలపు విత్తులు నాటి
ఇవాళ ఆ పువ్వును అధికార పీఠం మీద కూర్చోబెట్టాడంటే
ఇందులో అణువణువూ యడ్డీ మార్క్ వర్క్ హాలిక్ నెస్ కనిపిస్తుంది.
అదే మోదీని తీసుకుంటే
కేశూభాయ్ పటేల్ కు
వచ్చే ఎన్నికల్లో గెలిచేంత ఇమేజీ
సరిగా లేదని భావించి ఎవర్నీ గుజరాత్ సీఎం సీట్లో కూర్చోబెట్టాలా అని చూస్తుండగా
తమకెంతో విధేయుడన్న క్వాలిఫికేషన్ తో అయాచిత అవకాశాన్ని పొందాడు మోదీ.
తర్వాత గోద్రా వంటి అల్లర్లకు దగ్గరుండి అవకాశమేర్పరిచి
వాటి ద్వారా హిందూ ఓటు బ్యాంకును మెప్పించి
ఎలాగోలా తన సీటు సుస్థిరం చేసుకున్న మహా మతోన్మాద ఉత్కృష్టుడు.
దాన్ని పారదోలడానికి
గుజరాత్ మోడల్ డెవలప్ మెంట్ అంటూ కొత్త డ్రామాకు తెరలేపి
తనమీదున్న మత ముద్ర తొలగించుకోవడం కూడా ఒక ఎత్తుగడే!
మొత్తానికి మూడు సార్లు ఎలాగోలా ముఖ్యమంత్రి కావడం
ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ నాగ్ పూర్ బ్యాచ్ ను అట్రాక్ట్ చేయడం
సరిగ్గా అదే సమయంలో…
అద్వానీ పీఎం కేండెట్ గా ధర పలకడం లేదన్న ముద్ర పడ్డంతో
మోదీకి ఏ కెపాసిటీ లేకున్నా సరే అతడి చుట్టూ ఒక మార్కెట్ అల్లి..
అతడి గెడ్డం జుబ్బాలనొక బ్రాండ్ గా మలచి
పబ్లిసిటీ మంత్రంతో పీఎం కేండెట్ గా నిలబెట్టడం
ఆ సరికే కాంగ్రెస్ పదేళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వం రూపంలో
ఏ మంత గొప్పగా పరిపాలించ లేదనీ
పైపెచ్చు బలహీన ప్రభుత్వమనీ
అంతకన్నా మించి స్కాముల సర్కారనీ
మన్మోహనుడు పేరుకే పెద్ద పీఎం కానీ
వెనకుండి నడిపించేది విదేశీ సోనియా అనీ
రాహుల్ లో తదనంతర ప్రధానిని చూడ్డం వీలు కాదని
జనం భావించడం…
మూడు సార్లు ముచ్చటగా సీఎంగా చేసినోడైతే సుస్థిర పాలన అందిస్తాడన్న భరోసా ఏర్పడ్డంతో
తొలిగా ప్రధాని పీఠమెక్కాడు మోదీ.
కనీసం ఒక్కసారి కూడా పార్లమెంటు మెట్లను ఎక్కని మోదీ
నాగ్ పూర్ వ్యూహం ఫలించి
అనూహ్యంగా పార్లమెంటుకే అధినాయకుడే అవడం భారత రాజకీయ అద్భుతం.
ఓ సాధారణ చాయ్ వాలా- చాయ్ పే చర్చా సాధించిన అపూర్వ విజయం.
సరే పీఎంగా దేశాభివృద్ధిని ఎలా చేస్తాడో కదా అని ఎదురు చూసిన వారికి ఆశనిపాతమే అయ్యింది.
ఈ ఏడున్నరేళ్లో
మోదీ ఆణిముత్యాలను చూస్తే సర్జికల్ స్ట్రైక్స్ తో ఎంత మేలు చేశాడో తెలీదు కానీ
నిన్న మొన్న ఒక వ్యాపారి ఆత్మహత్య చేసుకోబోతూ చెప్పిన మాట ఏంటంటే
జీఎస్టీ వ్యాపారులకు ఎంతో నష్టదాయకమని అనడం గుర్తించాల్సిన అంశం.
అంతకన్నా ముందర నగదు రద్దు అయితే
నాటి యూపీ ఎన్నికల్లో ప్రత్యర్దుల నడ్డి విరచడానికి వాడ్డానికి అన్న మాట తెలిసిందే.
అదే రద్దు వల్ల మూత పడ్డ చిన్నా చితకా సంస్థలు లెక్కలేనన్ని
తద్వారా ఊస్ట్ అయిన కార్మికుల బతుకులు కో కొల్లలు.
ఈ పాదం.. ఏ భ్రమలు కడిగిన పాదమో తెలీదు కానీ
విడతలు విడతలుగా కరోనా లాక్ డౌన్లు
దీంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది ఒక్కొక్కరికి.
వలస జీవులు నడిచి వెళ్తోంటే గోడౌన్లలో ఉన్న ఒక్క మూట కూడా బయటకు తీయనంత కరుణామయుడు.
అదేమంటే ఆకలితో అలమటిస్తున్న కార్మికులకు టికెట్లు కొనిచ్చింది కాంగ్రెస్ అంటూ వారి మీద కల్లబొల్లి ప్రేమను ఒలక బోసిన పొలిటికల్ వ్యాలంటైన్
ఇస్తానన్ని ఇరవై లక్షల కోట్ల లో ఎన్ని కోట్లు ఎంత మంది ఖాతాలోకి వచ్చి పడ్డాయో తెలీదు.
ఇక కరోనా సమయంలో పీఎం రిలీఫ్ ఫండ్ కి వచ్చిన డబ్బు ఏమైందో అంతు చిక్కదు.
ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షలు
ఇంటికో ఉద్యోగం వంటి హామీలు గంగపాలు.
ఇస్తానన్న ఉద్యోగం ఇవ్వక పోగా పకోడీలు వేసుకుని బతకమంటూ ఉచిత సలహాలు.
ఆత్మనిర్బర్ భారత్ అంటూ వేల రూపాయల విలువైన విదేశీ పెన్నులు- లక్షలాది రూపాయల కోట్లూ- సూట్లూ- కోట్ల రూపాయల విలువైన విదేశీ కార్లు.. భారీ ఎత్తున ఖర్చు చేస్తూ భద్రతా ఏర్పాట్లు.
పేదోళ్ల గూడు సంగతి అటుంచితే
ఒంటికాయి సొంటికొమ్ముగాడు ఒక్కడు
కనీసం ఆ అమాయక భార్యామణిని కూడా దగ్గరకు తీసుకోకుండా
కేవలం ఒకే ఒక్కడు జీవించడానికి ఇరవై వేల కోట్ల రూపాయల ప్రజాదనం ఖర్చు పెట్టి ఇంద్ర భవనం.
ఎడా పెడా విదేశాలకు తిరగడానికి ఎయిర్ ఫోర్స్ వన్ రేంజిలో విమానం.
గురువుకూ పంగనామాలు పెట్టిన భారతీయ సంస్కృతీ సంస్కారం.
పాపం అద్వానీకి సోమ్ నాథ్ టెంపుల్లో రాష్ట్రపతిని చేస్తానని మాటిచ్చి
దళిత కార్డును వాడుకుని బయట పడ్డానికి ఆ పదవిని కూడా అడ్డంగా వాడేసిన మహారాజకీయ పండిత శిఖామణి బిరుదాంకితుడు మిస్టర్ మోదీ.
నేరుగా చేయాల్సిన ప్రజా సంక్షేమం చేయక పోగా
ఒక వేళ ఉచిత టీకాలని చేసినా దాన్ని కూడాఎన్నికల స్టంటుగా వాడగలిగిన ఫక్తు రాజకీయ వ్యాపారి.
ఇక్కడ రైతుల కోసం రైతు బంధు పెడితే దాన్నీ వదలక కాపీ కొట్టిన పరిపాలనా దక్షుడు.
సగటు భారతీయులను అటుంచితే
ఇప్పటి వరకూ మోదీ సొంత పెళ్లాం నుంచి మొదలు పెడితే
అన్నదమ్ముల వరకూ మాట్లాడుకుంటే
ఏ ఒక్కరికీ సాయం చేయక పోగా..
ఎక్కడే డబ్బుంటే దాన్నంతా లాగేసుకుని
తన ప్రభుత్వాన్ని నడుపుకోడానికి సరిపడా డబ్బు జమ చేస్తూ
జనాన్ని నానా సంకలు నాకిస్తోన్న మహా మహిమాన్వితుడు మోదీ.
దక్షిణాది ముఖ్యమంత్రుల్లో కనీసం యడ్యూరప్ప పాటి సమర్ధతతో కూడా పోటీ పడలేని
మోదీని చూసి ‘బండి’ జ్వరమంటుంటే
నవ్వాలో ఏడ్వాలో అర్ధం కావట్లా…
ఆ మాటకొస్తే ఒక కేజ్రీవాల్ మరో మమతా దీదీల్లోని సమర్థతలో పావు వంతు ఉన్నా
హీ ఈజ్ రియల్ హీరో అనొచ్చు.
అనామక అయాచిత
అదృష్టం బావుండి ప్రధాని పదవిని ఏకచెక్కగా ఏలుతున్నాడు తప్పించి
మరే గొప్పదనం కనిపించని గొప్పవాడు.
అదేమంటే కశ్మీర్లో పండిట్లు వెళ్లడానికి కాంగ్రెసే కారణమనీ
ఏపీ తెలంగాణ విభజన వంకర టింకరగా జరిగిందన్న కామెంట్లొకటి.
మాకు ఓట్లు వేయడం లేదు కాబట్టి మేం మీకు పనులు చేయడం లేదని నిస్సిగ్గుగా చెప్పడం ఒక కొసమరుపు.
పోలవరం విషయంలో పేచీ.
ఆంధ్ర హోదా విషయంలో మడత పేచీ.
విశాఖ ఉక్కు నుంచి సింగరేణి గనుల వరకూ
అన్నిటినీ అంబానీ అదానీల పరం చేయడానికి అతి పెద్ద స్కెచ్చు.
ఏ అనుభవమూ లేని అనిల్ అంబానీకి HAL కి ఇవ్వాల్సిన ఎయిర్ కాంట్రాక్ట్ ఇచ్చిన మాహా నిస్వార్ధ పరుడు.
లాభాల్లో ఉన్న ఎల్ఐసీనే అమ్మకానికి పెట్టి
రైల్వేలనూ ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న మహాత్ముడు.
బీఎస్ఎన్ఎల్ ను భూ స్థాపితం చేయాలన్న ఎత్తుగడలు.
పైపెచ్చు జమిలీ ఎన్నికలు తెచ్చి
తన డెబ్భై ఏళ్ల రాజకీయ రిటైర్మెంటు కామెంట్లకూ తిలోదకాలను ఇచ్చి
అధ్యక్ష పాలన తెచ్చి
ఒక పుతిన్ లాగా మరో చైనా జిన్ పింగ్ లాగా
చచ్చే వరకూ అధికార పీఠాన్ని అధిరోహించాలన్న అత్యాశ
కలిస్తే నరేంద్ర దామోదర దాస్ మోదీ.
ఈయనగారి రాజకీయ జీవితంలో
సగటు భారతీయ పౌరులకు
ఆసాంతం కనిపించినదంతా ట్రిక్కులే తప్ప ఏ జన సంక్షేమమూ కనిపించదు.
ఏ ఒక్కరికీ నేరుగా ఉపయోగపడని
ఐకానిక్ సజెస్టెడ్ పీఎం ఎవరైనా ఉన్నారంటే అది మోదీయే..
అలాంటి మోదీని చూసి ఇక్కడంతా ఉచ్చ పోస్కుంటున్నారన్న కామెంట్లను చూస్తుంటే
ఎంత భ్రమలో బతుకుతున్నార్రా నాయనా అనిపిస్తోంది.
ఓ కమల్ హాసన్ అన్నట్టు
మరో లగడపాటి ఆలోచించినట్టు
ఇది మా దక్కన్ పీఠభూమి
ఇది మా ద్రవిడ భూమి
ఆనాడు మీ అయోధ్య మా రావణ లంకను ఢీకొట్టి ఉండొచ్చేమో
ఈనాడు మా దక్షిణాది కష్టార్జితాన్ని తీస్కుని బతికి బట్టకడుతోన్న ఉత్తరాది మీది.
మా జీఎస్టీ డబ్బులతో నువ్వు నీ గల్లా నింపుకుంటున్నావు
అదేమంటే హైదరాబాద్ లో పాకిస్తాన్ ఉందనీ మా మధ్య మత చిచ్చు పెట్టి ఇక్కడకు రావాలనుకుంటున్నావ్
అది జరిగే పని కాదు..
కుట్రలూ కుతంత్రాలతో మా దక్షిణాదిని ఆక్రమించడం అంత సులువు కాదు.
గుర్తుంచుకో అచ్చే దిన్ తీసుకు రావడం చేతగాని నీకు
చచ్చే దినాలను బతికుండగానే చూపిస్తున్న నీకూ నీ బృందానికీ…
ఇదే మా హెచ్చరిక
ఇది మా సౌత్
పగులుద్ది మీ మౌత్!!!
– అజ్ఞాతవాసి