Suryaa.co.in

Devotional

ఓంకారం విశిష్ట‌త‌

మ‌న‌లో చాలామంది ప్ర‌శాంత‌త కోసం నిశ్శ‌బ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎంద‌రో శ్ర‌వ‌ణానందం క‌లిగించే శ‌బ్దాన్ని సంగీత రూపంలో ఆస్వాదిస్తారు. పంచ‌భూతాల్లో శ‌బ్దం అన్నింటికన్నా ముందు ఉంటుంద‌ని పండితులు చెబుతారు.
ఆ శ‌బ్దం ఆకాశం నుంచి ఉద్భవిస్తుంది. అయితే… శ‌బ్దానికి ఆధారం ఓంకారం. నిజానికి ఓంకారం ప్ర‌తి దేహంలో ఉంటుంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితమవుతుంది. ‘ఓం’ అన్న‌ది మంత్రం కాదు. వేదాల‌లో నిక్షిప్త‌మైన ఓంకార నాదం మానవ ఆరోగ్య ర‌హ‌స్యానికి ఒక సూత్రం.
ప్రాచీన కాలంలో ఋషులు వాతావర‌ణ ప్ర‌తికూల ప‌రిస్థితుల‌లో, కఠిన ఉప‌వాస దీక్ష‌ల‌లో కూడా ఆరోగ్యంగా ఉండ‌టం వెనుక ఓంకార నాద‌మే ర‌హ‌స్యం. విదేశాల్లోని విశ్వ‌విద్యాల‌యాల్లో జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో సైతం ఓంకారం మృత్యుంజ‌య జ‌పం అని బ‌య‌ట‌ప‌డింది.
ఓంకారం ఉచ్చ‌రించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు
నాభి లోంచి ల‌య‌బ‌ద్ధంగా ఓంకార ప‌దాన్ని ప‌ల‌క‌గ‌లిగితే మాన‌వుడి ఆరోగ్యం ప‌రిపూర్ణంగా ఉంటుంది. ఓంకారం ప‌దిహేను నిమిషాల పాటు ఉచ్చ‌రించ‌గ‌లిగితే ర‌క్త‌పోటు త‌గ్గుతుంది. ర‌క్త‌ ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌రిగి గుండె ఆరోగ్యంతో పాటుగా, మాన‌సిక అల‌స‌ట‌, అల‌జ‌డి త‌గ్గి ప్ర‌శాంతత క‌లుగుతుంది. ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌డుతుంది. జీర్ణ ప్ర‌క్రియ స‌వ్యంగా సాగుతుంది. కిడ్నీ వ్య‌వ‌స్థ క్ర‌మ‌బ‌ద్ధంగా ప‌నిచేస్తుంది. థైరాయిడ్ ప‌నితీరును క్ర‌మ‌బ‌ద్ధం చేస్తుంది. ఓంకారంలో ఉన్న అద్భుతాన్ని ఆస్వాదిద్దాం

LEAVE A RESPONSE