– తెలంగాణ శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , పరిషత్ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ , లేజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణములోని తెలంగాణ శాసన పరిషత్ భవనం (హెరిటేజ్ బిల్డింగ్) పునర్నిర్మాణ పనులను తెలంగాణ శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , పరిషత్ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ , లేజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు పరిశీలించారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ…. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదే సమయంలో హెరిటేజ్ భవనం అయినందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న సమావేశాలు ఈ భవనంలో నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనులను పరిశీలించడానికి వస్తారని, పనులలో ఎలాంటి జాప్యం చేయకుండా , వేగంగా పూర్తి శాసన మండలి అధికారులకు అప్పగించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆర్ &బి అధికారులు, అగాఖాన్ సంస్థ ప్రతినిధులతో అసెంబ్లీ స్పీకర్ చాంబర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.