మెలోడీకి చక్రవర్తి..
రణగొణధ్వనికీ
ఆయనే సమవర్తి..
పొన్నకల్లు స్వస్థానం
చీకటి వెలుగుల కౌగిలిలో
సాగింది చక్రవర్తి
సంగీత ప్రస్థానం..!
చక్రవర్తి సినిమాల్లో సాహిత్యాన్ని మింగేసే సంగీతం
హో”రెట్టించే ”
వాద్యాల మోతలు..
ఇవి కొమ్మినేని అప్పారావుపై
మోతెరిగి వాతలు!
అయితే *మల్లెపూవు* లో
ఆయన ప్రతిభ కొత్తపుంతలు..
గురుదత్ ప్యాసాతో సమంగా
మండు వేసవిలో హిమసుమాలు..
ఒళ్లంత గిలిగింతలు..
తుళ్ళింతలు!
తళతళలతో తరుణకిరణ
సంచలిత లలిత
శృంగార తటిల్లత
కదలగా..కనులు చెదరగా.
అద్భుత గీతం..
కొమ్మినేని గతం..!
శారద..నను చేరగ
ఏమిటమ్మ సిగ్గా.
ఎరుపెక్కే లేతబుగ్గ..
ఓ శారదా..
ఈ పాటతోనే మొదలైంది
చక్రవర్తి పాటల వరద..
ఓ దశకం చక్రవర్తి శకం..!
యమగోలతో అసలైన గోల
నందమూరి రామారావుకు
హిట్టు సినిమాల *వేటగాడు..
అక్కినేనికి పాటల *ప్రేమాభిషేకం..
ఆ వెంటనే ఆ మహానటుడికి
చెమ్మచెక్కల _*ప్రేమకానుక!*
కృష్ణకి అశ్వద్ధామ..
వజ్రాయుధం..
శోభన్ తో జేబుదొంగ.._
చక్రవర్తి సంగీత ప్రయాణం
అంగరంగ వైభోగంగ..!
డబ్బింగులోనూ
ఎరువిచ్చి గొంతు..
ముందు కమల్ వంతు
ప్రేమలేఖల్లో అనంతనాగ్
డైలాగులు పసందు
ఎందుకని అడుగు..
ముద్దుగా పలికిన
కొమ్మినేని వారి బుడుగు..
ముందు గాయకుడు..
కొన్ని సినిమాల్లో నటుడు..
మొత్తంగా బట్టతల అప్పారావు
వీనుల విందైన పాటల
సంగీతరావు!
సంగీత దర్శకుడు
కొమ్మినేని చక్రవర్తి
జయంతి సందర్భంగా..
_ ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286