Suryaa.co.in

Andhra Pradesh

వైభవంగా శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ

– హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

తిరుపతికి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ) వద్ద నిర్మించిన శ్రీ వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

అనంతరం ముఖ్యమంత్రి సంప్రదాయ దుస్తులు ధరించి, ఆలయ పుష్కరిణి లోకి వెళ్ళి నీటిని తలమీద చల్లుకున్నారు. ఆ తరువాత టీటీడీ అధికారిక వృక్షం మానుసంపంగి మొక్క నాటారు.

అక్కడి నుంచి ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్య అర్చకులతో కలసి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అక్కడి నుంచి మేళతాళాల నడుమ ప్రదక్షణగా ఆలయంలోకి చేరుకున్న సిఎం జగన్మోహన్ రెడ్డి శ్రీ వకుళమాతను దర్శించుకున్నారు.

 

LEAVE A RESPONSE