పనికిరాని వెధవ… దరిద్రుడు… సన్నాసి, పార్లమెంట్ నేత అయినందుకు చింతిస్తున్నా

Spread the love

– పెంట తినే వారే ఈ రకంగా మాట్లాడతారు
– దమ్ముంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయ్
– వీళ్ళా మన పాలకులని ప్రజలు అసహ్యించుకుంటున్నారు
– నేను , నీకంటే ఎక్కువగా మాట్లాడగలను… కానీ సంస్కారం అడ్డొస్తోంది
– నా అనర్హత కోసం తలకిందులుగా తపస్సులు చేశారు కదా..
– నేనేమీ తప్పు చేయలేదు నా పై అనర్హత వేటు పడే ఛాన్సే లేదు
– విజయసాయిరెడ్డి ట్వీట్లపై ఎంపీ రఘురామ ఫైర్

తాను దిక్కుమాలిన గడ్డం వాడిలా మాట్లాడడానికి సంస్కారం అడ్డు వస్తుందని, తన నిస్సహాయత కు క్షమించాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు కోరారు. పనికిరాని వెధవ .. దరిద్రుడు… సన్నాసి, పార్లమెంట్ నేత అయినందుకు చింతిస్తూ, ఈ వెధవ నన్ను ప్రోత్సహిస్తున్న కంటికి కనపడని వెధవ లాగా తాను కూడా సభ్యత లేని , సంస్కారహీనుడిని అయితే, వైయస్ వివేకానను హత్య చేసింది జగనే అనే వాడిని కదా? అన్నారు. తాను అలా అనలేదని అంటే, తనకున్న సంస్కారం, సభ్యత కారణమని చెప్పుకొచ్చారు. నా వైపు ఒక వేలు చూపిస్తే, మీ వైపు వేళ్ళు చూపిస్తాయన్న విషయాన్ని గమనించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే తనని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, కుళ్ళిన శవాన్ని పక్కన ఎందుకు పెట్టుకుంటారని ప్రశ్నించారు.

గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తన గురించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ… పెంట తినే వారే ఈ రకంగా మాట్లాడగలరని మండిపడ్డారు.. నువ్వు నికృష్టుడు అన్నా, తనకు శ్రీకృష్ణుడు అన్నట్లుగానే వినిపిస్తుందని చెప్పారు.

తాను ఏ వన్ చరిత్ర, కులం వివరాలన్నీ తీయగలనని, నీ రాసలీలలు గురించి మాట్లాడగలనని, కానీ మాట్లాడటం లేదన్నారు. కుళ్ళిన శవాన్ని పక్కన పెట్టుకుంటే ప్రమాదం… ఒరేయ్ ముసలి నక్క, నువ్వు ఒక పిచ్చి కుక్క తో కలిసి ఎన్ని కామెంట్లు చేసినా పీకలేవు రా అని అనాలని అనుకున్నాను కానీ సంస్కారం అడ్డు వస్తుందని చెప్పారు. చాలామంది ఇది తనకు ఫోన్లు చేసి, మీ స్థాయికి వారి మాటలకు స్పందించడం ఏమిటి అంటూ ప్రశ్నించారన్నారు. అందుకే తాను వారు చేస్తున్న వ్యాఖ్యలకు పెద్దగా స్పందించడం లేదన్నారు. ఏ టూ, నీ కు కీ వాడిని. ఇంకా ఎక్కువగా తిట్టించాలని ఉంటే, గంటలో గా ఒకటి వదులు, నేను కూడా దీటుగా వదులుతానని అన్నారు.

ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకున్న పరిపాలకులు వీళ్ళా అని ప్రజలు అసహ్యించుకుంటున్నారని… శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, ఈ లఫంగి మాట్లాడాలంటే, ఈ లఫంగికి కీ ఇచ్చే కెపాసిటీ ఎవరికి ఉంటుందో ప్రజలందరికీ తెలుసునని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఎన్ని నంగనాచి మాటలు మాట్లాడిన, పెద్ద మనిషి లా కబుర్లు చెప్పినా ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతూనే ఉన్నాయని చెప్పారు. మారండి రా… మారినట్లు కనీసం నటించండి రా అన్న రఘురామకృష్ణంరాజు, వీళ్ళ కా ఓట్లు వేసిందని ప్రజలు , మిమ్మల్ని చూసి అసహ్యించుకుంటున్నారని అన్నారు.

మిమ్మల్ని అసహ్యించుకునే ప్రక్రియలో, ఈ దుష్టచతుష్టయం లో .. సజ్జల, సాయి, అసలు కసాయి తో తాను లేకపోయినా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్నందుకు… మీరు మాట్లాడిన అసహ్యపు భాష దీటుగా తిరిగి, తాను ఒక్క మాట్లాడిన తన అభిమానులు నొచ్చుకుంటున్నారని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

మళ్లీ ప్రారంభోత్సవాలా?

గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి టి సి ఎం, డి క్సా న్ వంటి పెద్ద, పెద్ద కంపెనీలు అప్పటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమర్ధత వల్ల వచ్చాయని, ఇప్పుడు సాక్షి దినపత్రికలో పెద్దపెద్ద వ్యాపార ప్రకటనలు వేసుకొని ప్రారంభోత్సవాలు చేయడం విస్మయం కలిగిస్తోందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. తన నియోజకవర్గంలో, ప్రధాని పర్యటన సందర్భంగా తాను కచ్చితంగా హాజరవుతానని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ దాష్టీకాలు గురించి, ప్రధానమంత్రి కార్యాలయానికి, హోం మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కలిసి వివరించానని తెలిపారు. తనపై ఇప్పటివరకు ఉన్న కేసుల్లో స్టే ఉందని, అవసరమైతే జూలై 5వ తేదీ తర్వాత 175 నియోజకవర్గాల్లో 175 కేసులు పెట్టిన న్యాయస్థానంలో ఎదుర్కోవడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు.

బెయిల్ పిటిషన్ పై సుప్రీం ఆశ్రయిస్తా

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దు పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉందని, హైకోర్టు ఈ పిటీషన్ ను కొట్టి వేస్తే తాను అదనపు సమాచారం తో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. న్యాయం జరగడంలో ఆలస్యం కావచ్చు కానీ, న్యాయం జరగకుండా పోదని అన్నారు. తల్లిని గౌరవించని, చెల్లిని పట్టించుకోని ఒక వ్యక్తి చేత, వకుళమాత ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమం జరగడం ఈయన అదృష్టం అయితే, అది వకుళ మాత దురదృష్టమని వ్యాఖ్యానించారు.

అమ్మ ఒడి లో కటింగ్ లే…కటింగ్ లు
జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం లో కటింగ్ లే.. కటింగు లను పెడుతున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. తనకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి పిల్లలు చదివే పాఠశాలలో తొలుత 250 మందికి అమ్మ ఒడి పథకం కింద డబ్బులు ఇస్తే, ఇప్పుడు కేవలం 170 మందికి ఇస్తున్నట్లుగా చెప్పారన్నారు. ఆ ముక్క ఒంగోలు జిల్లాలోని 80 వేల మందికి అమ్మ ఒడి పథకంలో కటింగ్ పెట్టారని సాక్షాత్తు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.

అమ్మఒడి పథకానికి తొలుత 15000 ఇస్తామని చెప్పి రెండు వేల రూపాయల కోత విధించారని, ఇప్పుడేమో కుంటి సాకులు చూపెడుతూ అర్హులనే, అనర్హులు చూపెడుతూ కటింగులు విధిస్తున్నారన్నారు. క్రిస్టియన్ స్కూళ్లలో చదివే వారికి కటింగులు విధించడం లేదని తెలిసిందని, అది మంచిదేనని పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకం లబ్ధిదారుల వివరాలను గతం స్కూల్ వద్ద సేకరించే వారని, కానీ ఇప్పుడు వాలంటీర్ల ద్వారా సేకరి స్తున్నారని తెలిపారు.

 

Leave a Reply