Suryaa.co.in

Features

శీకాకులం తల్లీ ఇక నీకు సెలవామరీ!

ఊహ తెలిసినప్పటి నుండి శీకాకులం మాది అనే టోల్లం
“కొండవీటి సింహం” ఎన్టీ వోడి
సర్యమహల్ నుండి “ప్రేమాభిషేకం”
ఎన్నార్ వరకు “సీతారామ” టాకీస్
సాచ్చి గా చిన్ననాటి సినిమా బంధం పుటుక్కున తెగిపోతుంది!

టెన్త్ పాస్ అయ్యాక ఎంప్లాయిమెంట్ మెంట్ పేరుతో చేపల ఈది ఎక్కడ అంటూ బయలుదేరిన నేను “ఆర్ట్స్ కాలేజీ” అరుగులు ఎక్కే వరకు జనరల్ హాస్టల్ రూం వరకు సాగిపోయింది
సికాకులం సదువుల సారంగం!!!
పావలా కార్డు నుండి ఇన్లాండ్ లెటర్ వరకు సివర ఆకరునా
“శ్రీకాకుళం (జిల్లా)” అని రాస్తే
అమ్మమ్మ పేరు రాసినంత ఆనందం!
ఇప్పుడు ఇడి పోతున్నాం జిల్లా పేరు సివరన రాయా లంటే “ఇంటి పేరు” మారినంత సికాకు గా వుంది!

సిన్నప్పటి సెవెన్ రోడ్ జంక్షన్, బుక్కడి బంద రోడ్,ఇల్లిసిపురం
ఇంగ్లీష్ సినిమా లచ్చిమీ టాకీస్
రామ లక్ష్మణ జంక్షన్ తో నీకు పెద్దగా పనిలేదు అంటే ఏదో వెలితిగా తాత గారింటికి రావద్దు
అన్నట్టు గుండెబరువుఎక్కుతుంది!

నిన్న కలెక్టరేట్ బురుజు తేరిపార చూసాక ఒరేయ్ చిన్నోడా మీ నాన్న కూడా ఇవే చెక్కమెట్లు ఎక్కి
వచ్చే వాడు ఇక నుండి నువ్వు రావు విడిపోయి యాడికో పోతున్నావు నన్ను “మరిసి పోకు”
అంటూ వీడ్కోలు సెప్పింది!!

ఏమూలకెల్లినా శికాకులం వొళ్ళు
మంచోల్లు , నీతి నిజాయితీ నిప్పు లా అంటుంటే గుండె పొంగి పోయేది, ఇప్పుడు నన్ను ఎవుడు అలా పొగుడు తాడుకొత్త పేరు తో?

నీ పేరు తో పుట్టాము పెరిగాం పెద్దల్లం అయ్యాము అడ్రస్ లో నీ పేరు తీసెయ్యాలి అంటే గుండె కలుక్కుమంటుంది సిక్కోలుఅమ్మా!

ఇదేమి సిత్రమో, బాగార్లు వీడినట్టు
బంధాలు తెంచుకోమంటూ “ఉగాది” తో నిన్ను వోగ్గేయ మాంటే
కళ్ళు చెమర్చు తున్నాయి!!!

నేను యాడ వున్నా నువ్వు నా అమ్మవే కాదు అమ్మమ్మవే! అమ్మా పుట్టింటేవే! నేనెప్పటికీ సిక్కోలు బిడ్డనే,నీ “మనవుడు” నే నువ్వు చల్లగా వుండాలి వంశధార నాగావళితో పచ్చగామెరిసిపోవాలి!
మళ్ళీ మళ్ళీ వస్తాను జాతర్లు కి యాతర్లుకి, వొంటికిబాగులేనప్పుడు
నిన్ను సూడాలి అన్నప్పుడు అల్లా!!
సన్నటి కన్నీటి తెరలు మద్య ఇన్నేళ్ల అనుభందం తెంపుకొంటూ
పక్క జిల్లాకి పయనమై పోతున్నా
ఇక సెలువు సిక్కోలు తల్లీ సెలవు!!!
(ఎవరు రాశారో తెలీదు కానీ బరువెక్కిన హృదయంతో రాశారు.)

LEAVE A RESPONSE