Suryaa.co.in

Andhra Pradesh

జగనన్నను దూషిస్తే ఒక్కొక్కరికి తాటతీస్తా

– నన్ను దూషిస్తే ఊరుకున్న, కానీ నా దైవం జగనన్నను దూషిస్తే సహించేది లేదు
-శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
హిజ్రాలు సాక్షాత్తు అర్థనారీశ్వర స్వరూపులు,అందరిలో ప్రవహించేది రక్తమే, నా రక్తం మరిగిపొతుంది అంటూ తెగ ఊగిపోతున్నావు. పట్టాభి మాటలకు జగనన్న ఊరుకున్న ఆయన సైనికులుగా మేము ఊరుకోము. చంద్రబాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయాలే, సొంత మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని రాజకీయాల్లోకి కొనసాగుతున్నాడు. ముఖ్యమంత్రిగా మీ తండ్రి ఉండగానే ఒక ఎమ్మెల్యే గా కూడా గెలవని శుంఠ లోకేష్.
కుప్పం స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన మీకు ఇంకా జ్ఞానోదయం కలగలేదు. ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే తీసుకురండి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి వై. యస్.జగన్మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ తో ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం, పెళ్లి మండపం వద్ద జనాగ్రహ దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, పట్టణ వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడుకి అసెంబ్లీలో చాలా సార్లు చెప్పాను మన చిత్తూరు జిల్లా పరువు తియకు అనీ కానీ ఆ మనిషి మారేట్లు కనబడడం లేదు. నిన్న జగన్ అన్న మాటలు వింటుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, పేద ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న జగనన్న కుటుంబంపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. జగనన్నను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ములేక చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు చేయిస్తున్నాడు.
నిన్న ఒక నాయకుడు విజయవాడలో ఊగిపోతూ హిజ్రాలతో పోలుస్తున్నారు, హిజ్రాలు సాక్షాత్తు అర్థనారీశ్వర స్వరూపులు.నన్ను దూషిస్తే ఊరుకున్న, కానీ నా దైవం జగనన్నను దూషిస్తే సహించేది లేదు,నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ఒక్కొక్కరికి తాటతీస్తా.ఒరేయ్ సుధీర్ ఇంటికెళ్ళి మీ అమ్మని అడుగు కర్నూల్ అని అడుగు మీ చరిత్ర బయటకు తీస్తే మీ ఇంట్లో ఎవరు నిద్రపోడు. ఈమాట కొంతమందికే తెలుసు. అమ్మ కర్నూల్ అంటే ఏందమ్మా అని అడుగు. నేను నోరు తెరిస్తే మీ కుటుంబ చరిత్ర శ్రీకాళహస్తి వీధుల్లో పెట్టి కడిగేస్తా. నువ్వెంత నీ బతుకెంత.
మేము అంబాసిడర్ కారులో తిరిగే రోజుల్లోనే మీ కుటుంబం మా ఇంటి ముందుకొచ్చి డబ్బు కోసం వేచి ఉన్నారు. మా తాత వెంకటగిరి రాజా గారి మీద ఎమ్మెల్యేగా గెలిచాడు. మీకు రాజకీయ భిక్ష పెట్టిందే మా కుటుంబం. ఎన్టీ రామారావు కి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడుకి- సొంతంగా పార్టీ పెట్టి 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న జగనన్న కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీరా మా నాయకుడు గురించి మాట్లాడేది మా నాయకుడు కాలి గోటికి కూడా సరిపోరు. మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు ఎర్రచందనం, ఇసుక మాఫియా, గుడిలో విగ్రహాలు అమ్మేసి వేల కోట్లు సంపాదించు నీ పాపం పండే రోజులు దగ్గరలోనే ఉంది.
నీ అక్రమ సంపాదన వల్ల చివరికి మీ నాయన మినిస్టర్ పదవి కూడా పోగొట్టావు. మీ అమ్మా నాన్న నీకు ఏమి సంస్కారం నేర్పించారో నాకు తెలియదు నికన్న వయస్సు లో చిన్న మా పవిత్రమ్మ నీ చూసి నేర్చుకో పెద్దలకు ఎలా మర్యాద ఇవ్వాలి అని. అలాంటి ప్రజా సేవ చేస్తున్న నా బిడ్డని తిడతావు.అలాగే మా భార్య గురించి మాట్లాడతావ్. మా భార్య కి దేవునికి పూజ చేయడం ఒక్కటే తెలుసు మీ లాగా పబ్ కు వెళ్లి మందు తాగడం తెలియదు.తెలుగు హీరోయిన్ హత్య కేసులో నువ్వు ఒక నిందితుడువి. మొన్న రేణిగుంటలో వెళ్లి రౌడీయిజం చేసావ్ అప్పుడు మా మహిళలు చాట, పొరకట్ట తో గట్టిగా బుద్ధి చెప్పారు నీకు.
నీ బతుక్కి శ్రీకాళహస్తిలో ఒక ఎంపీటీసీ అయిన గెలిపించుకోగలిగావ, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడని పూనకం వచ్చినట్టు ఊగిపోయావు. ముసలోడు చంద్రబాబుకే ఇన్ని తెలివితేటలుంటే యువరక్తం జగనన్నకు ఎంత ఉండాలి. ఇకపోతే మీ కొడుకు లోకేష్ నువ్వు సీఎంగా ఉండి కూడా నీ కొడుకుని గెలిపించుకోలేని దద్దమ్మ వి నీకెందుకు మా జగన్నన్నతో పోటీ. చంద్రబాబు నాయుడు నీకు మళ్లీ చెప్తున్నాను మీకు మీ కుటుంబానికి మర్యాద ఉండదు, నువ్వు పట్టాభి దగ్గర మాట్లాడించిన మాటని మేము గానీ నీ భార్య ని అడిగితే నువ్వు నిద్ర కుడపోవు.మర్యాదగా మాట్లాడండి. నీ చరిత్ర మొత్తం తెలుసు.ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఇలాగే మాట్లాడుతూ పోతే రాళ్లతో కొట్టి కొట్టి తరుముతారు.
తెలుగు దేశం పార్టీ వాళ్లు, వాళ్ల మీద వాళ్ళే రాళ్ళు వేసుకొని జగనన్న మీద అబద్ధపు ఆరోపణలు చేయాలని చూశారు. కానీ మన పోలీస్ శాఖ వారు అప్రమత్తంగా ఉండటంతో వాళ్ళు డ్రామాలు ఫలించలేదు. పోలీస్ శాఖ వారందరిని ఒకటే కోరుకుంటున్నాను దయచేసి తెలుగుదేశం వాళ్ల మీద ఓ కన్నేసి ఉంచండి రాష్ట్రంలో లేనిపోని అలజడి సృష్టించాలని చూస్తున్నారు అన్నారు.

LEAVE A RESPONSE