Suryaa.co.in

Andhra Pradesh

శ్రీవాణి ట్రస్ట్ పై.. చెవిలో “కమలం” పెట్టకండి!

– అది స్టేట్మెంట్ కాపీ అవుతుంది కానీ శ్వేత పత్రం కాదు
– ఆఫ్లైన్లో ఎన్ని ఇచ్చారు?
– ఆన్ లైన్ లో ఎన్ని ఇచ్చారు?
– రోజువారీ ఆదాయం ఎంత వచ్చింది
– సమగ్ర సమాచారంతో వివరంగా ఇస్తే, దానిని శ్వేత పత్రం అంటారు
– ప్రైవేటు బ్యాంకులలో కూడా కోట్లాది రూపాయలు డిపాజిట్లు
– శ్రీవారి నిధులను జాతీయ బ్యాంకులలో డిపాజిట్ చేయాలి

శ్రీవాణి ట్రస్ట్ పై టీటీడీ ని భక్తులు ప్రతిపక్ష పార్టీలు అడిగిన ప్రశ్నలకు, సంబంధిత అధికారులు శ్వేతపత్రం విడుదల చేయడం శుభపరిణామం . కానీ ఆ లెక్కల్లో తేడాలు ఉన్నాయని, కోట్లాదిమంది భక్తులలో శ్రీవాణి ట్రస్ట్ పై పెద్ద చర్చ జరుగుతుంది! గుమ్మడికాయల దొంగ అంటే కమలం నేతలు ఎందుకు భుజాలు తడుము కుంటున్నారో ఆ వెంకన్నకే ఎరుక?

శ్వేత పత్రం అంటే
శ్రీ వాణీ ట్రస్టు ప్రారంభం నుంచి నేటి వరకు ప్రతిరోజు ఎన్ని టికెట్లు ఇచ్చారు?
ఆఫ్లైన్లో ఎన్ని ఇచ్చారు? ఆన్ లైన్ లో ఎన్ని ఇచ్చారు? రోజువారీ ఆదాయం ఎంత వచ్చింది? డిజిటల్ పేమెంట్ లో ఎన్ని టికెట్లు ఇచ్చారు? కంప్యూటర్లు మొరాయించినప్పుడు నగదు తీసుకొని, ఏమైనా టిక్కెట్లు ఇచ్చారా అన్న సమగ్ర సమాచారంతో వివరంగా ఇస్తే, దానిని శ్వేత పత్రం అంటారు.

టీటీడీకి సంబంధించిన డిపాజిట్లను, ప్రైవేటు బ్యాంకులలో డిపాజిట్లు చేయకూడదని శ్రీవారి భక్తునిగా , హైకోర్టులో పిల్ వేయడం జరిగింది అప్పటి ఈవో ఇకపై జాతీయ బ్యాంకులలోనే డిపాజిట్ లు చేస్తామని కోర్టుకి హామీ ఇవ్వడం జరిగింది. అలాంటిది తిరిగి శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చిన నిధుల శ్వేత పత్రం చూస్తే, జాతీయ బ్యాంకులతో పాటు, చాలా ప్రైవేటు బ్యాంకులలో కూడా కోట్లాది రూపాయలు డిపాజిట్లు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వీటి కారణంగా శ్రీవారి భక్తులలో పలు అనుమానాలకు తావిస్తోంది.

శ్రీవారి నిధులను జాతీయ బ్యాంకులలో డిపాజిట్ చేయాలి. ప్రైవేట్ బ్యాంకులలో డిపాజిట్ చేయడంపై టీటీడీ భక్తులకు సమాధానం చెప్పాలి.

“శ్వేత పత్రం” అంటే ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండాలి. అలా కాకుండా 850 కోట్లు వచ్చింది. బ్యాంకులో డిపాజిట్ చేసాము అని శ్వేత పత్రం విడుదల చేసి, చేతులు దులుపుకుంటే, అది స్టేట్మెంట్ కాపీ అవుతుంది కానీ శ్వేత పత్రం కాదు.

శ్రీవారి భక్తులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత, టిటిడి అధికారులపై ధర్మకర్తల మండలి పై మాత్రమే ఉంటుంది. అది వారి బాధ్యత అని తెలియజేస్తున్నాను. ఇది కూడా చదవండి: వివాదాల ‘శ్రీవాణి’

– నవీన్ కుమార్ రెడ్డి
శ్రీవారి భక్తులు
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్

LEAVE A RESPONSE