శ్రీవారి గరుడసేవలో రాష్ట్ర డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి
పరమ పవిత్రమైన గరుడ వాహనం అధిరోహించి శ్రీ మల్లప్ప స్వామి వారు తిరుమల మాడవీధుల నందు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ., వారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పోలీస్ సిబ్బందితో మమేకమై బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గరుడ వాహనం వైశిష్ట్యం:-
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు రాత్రి గరుడ వాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు.
ఈరోజు రాత్రి 7 గంటలకు శ్రీవారు గరుడ వాహన సేవ ప్రారంభం అయింది. పోలీసులు మరియు టీటీడీ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గరుడ సేవ దర్శనం ప్రణాళిక ను విజయవంతంగా అమలు పరిచి సుమారు 2 లక్షల మంది పై చిలుకు భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడ సేవ దర్శనం కల్పించారు. కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు నడుమ శ్రీవారి భక్తులకు అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం కలగకుండా పోలీస్ వారి విస్తృత సేవలతో అయిదవ రోజు రాత్రి గరుడ వాహనం సేవ విజయవంతంగా ముగిసింది.