Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర లైఫ్ లైన్ పోలవరం ప్రాజెక్ట్ కి లైఫే లేకుండా చేశారు

-పోలవరం నిర్మాణంపై తేదీలు, సంవత్సరాలు మార్చిన వీళ్లకంటే జోకర్లే నయం
-మూర్ఖత్వం, చేతగానితనంతో పోలవరాన్ని జగన్ రెడ్డి గోదాట్లో ముంచేశాడు
-ప్రజల్లో మార్పు వస్తేనే పోలవరం పూర్తవుతుంది
-నా సంకల్పాన్ని ఎవరూ ఆపలేరు. పోలవరం పూర్తిచేసి, నదుల అనుసంధానంతో తెలుగుజాతిని ముందు నిలపడమే నా లక్ష్యం
-సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని -ప్రాజెక్టులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి పవర్ పాయింట్ ప్రజంటేషన్

“ పోలవరం సహా, యుద్ధప్రాతిపదికన సాగునీటిప్రాజెక్టులు ఎలా నిర్మించాలో ఆచరణలో చేసి చూపించాము. పోలవరం నిర్మాణం కోసం ఎంతగా కష్టపడ్డామో, ఇప్పుడున్న చేతగాని ప్రభుత్వంవల్ల జాతీయప్రాజెక్ట్ కు ఎంత నష్టం జరిగిందో చూస్తున్నాం.

రాష్ట్రానికి లైఫ్ లైన్ అయిన పోలవరానికి లైఫే లేకుండా చేశారు. పోలవరం పూర్తి కావాలంటే ప్రజల్లో మార్పురావాలి. తెలంగాణలో సాగు ఆయకట్టు పెరిగితే, ఏపీలో తగ్గిపోయింది. నా సంకల్పానికి ఎవరూ అడ్డురాలేరు. పోలవరం పూర్తిచేసి, నదు ల అనుసంధానంతో తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్లేవరకు ఆగేదిలేదు. గోదావరిలో వృథాగా పోయేనీటిని రాష్ట్రావసరాలకు వినియోగించుకోవడంపై ఎవ రూ అభ్యంతర పెట్టలేరు. పెట్టినా ఉపయోగం ఉండదు.

ఈ ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం జఠిలంగా మారింది. ధవళేశ్వ రం బ్యారేజీ నిర్మించాడని బ్రిటీష్ వాళ్లు అయినప్పటికీ ఇక్కడి ప్రజలు కాట న్ ను తమ హృదయాల్లో నిలుపుకున్నారు. ప్రజలకోసం, కరువుకాటకాలు లేకుండా చేయడంకోసం అతను మానవ త్వంతో పనిచేశాడు. ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణంతో ఈ ప్రాంతం సస్యశ్యా మలైంది. అభివృద్ధికి నమూనాగా నిలిచింది. రాష్ట్రంలో ఐదుప్రధాన నదులతోపాటు 69 ఉపనదులున్నాయి. గోదావరి నది అటు శ్రీకాకుళం, ఇటు రాయలసీమలోని నదులకు మధ్యలో ఉంటుం ది. గోదావరి నీటిని సమర్థవంతంగా వినియోగిస్తే, రాష్ట్రానికి నీటి సమస్యే ఉండదు.

రాష్ట్రానికి వరం పోలవరం. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నాగావళికి, వంశధారకు కనెక్ట్ అవుతుంది. కుడిప్రధాన కాలువద్వారా నీటిని తరలిం చి, పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు అందించాం. కృష్ణాడెల్టాకు అందించా ల్సిన 120 టీఎంసీల నీటిని శ్రీ శైలంనుంచి రాయలసీమకు తరలించాం.

పోలవరంసహా రాష్ట్రంలోని అన్నిసాగునీటి ప్రాజెక్టులపై టీడీపీనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. స్వర్గీయ ఎన్టీఆర్ చొరవతో తెలుగుగంగ, హంద్రీనీవా పూర్త య్యాయి. నేనువచ్చాక ముచ్చుమర్రి పూర్తిచేశాను. ఈ మూడు కే.సీ. కెనాల్ ద్వారా బనకచర్ల వద్ద కలుస్తాయి.

పోలవరంతో పాటు చింతలపూడి లిఫ్ట్ పూర్తైఉంటే రాష్ట్రం సుభిక్ష మయ్యే ది. ఈ ప్రభుత్వం రావడంతో చెప్పలేనంత నష్టం జరిగింది. పోలవరం ఒక చరిత్ర, ఒక కల.

పోలవరం ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపం…
తొలిసారి బ్రిటీష్ ప్రభుత్వంలో 1941లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి పోలవరం నిర్మాణ ప్రతిపాదన వచ్చింది. 1942 అక్టోటర్ 10న బ్రిటీష్ ప్రభుత్వం ప్రాథ మిక పరిశీలన కోసం జీవోనెం-3704 PW విడుదలచేసింది.

రకరకాల ప్రతిపాదనలు, పరిశీలనల అనంతరం 340 టీఎంసీల నుంచి 83 6 టీఎంసీలకు పెంచారు. ఆ స్థాయిలో నీటిని సేకరించాలని ఆలోచించారు. ప్రాజెక్టు కోసం 13ప్రాంతాలు పరిశీలించి, చివరకు ఇప్పుడు నిర్మించిన ప్రాం తాన్ని ఎంపికచేశారు. 1947-48లో పోలవరం ప్రాజెక్ట్ విలువ రూ.129 కోట్లుగా అంచనావేసి, రామపాద సాగర్ గా ప్రాజెక్టుకి నామకరణం చేశారు.

ఇప్పుడున్న పోలవరం ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం 194టీంసీలు. మరో 200 టీఎంసీలు అదనంగా వినియోగించుకునే అవకాశముంది. 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. 28.50 లక్షల జనాభాకు తాగునీరు, 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి. వాటర్ టూరిజం అభివృద్ధితో పాటు పరిశ్రమలకు నీరు అందించవచ్చు.

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నిర్వాకంతో పదేళ్లు ఆలస్యం…
2004లో పోలవరం టెండర్లు పిలిచి మధుకాన్, శీనయ్య సంస్థలకు పనులు అప్ప గించారు. అప్పుడే కక్షసాధింపులకు ఈ ప్రాజెక్ట్ బలైంది. పనులు అప్పగించిన సంస్థలపై కక్షసాధింపులకు పాల్పడ్డారు. 2004 నుంచి 2014వరకు కేవలం 5 శాతం మాత్రమే పనులు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంకోసం వై.ఎస్.ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం రూ.423 కోట్లు మాత్రమే. రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు.

పొరుగురాష్ట్రాలతో ఉన్న వివాదాలు, సమస్యలు పరిష్కరించలేదు. కోర్టుకేసుల్ని పెండింగ్ లోనే ఉంచి మొక్కుబడిగా పనులు ప్రారంభించారు. దాంతో 2004 నుం చి 2014వరకు పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

ఇవన్నీ నేనుచెప్పడం కాదు.. పీపీఏ (పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ) నే చెప్పింది. అప్పుడు జరిగిన.. ఈ ప్రభుత్వం వచ్చాక చేసినతప్పుల్ని పీపీఏ బయట పెట్టిం ది. 2004లో హెడ్ వర్క్స్ అవార్డ్ అయ్యి 2009వరకు ఎలాంటి పురోగతి లేకుండా నిలిచిపోయాయని, 2009లో రీ టెండరింగ్ చేసినా, 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చేవరకు పనుల్లో ఎలాంటి పురోగతి లేకుండా చేశారని పీపీఏ చాలా స్పష్టంగా చెప్పింది.

ఈ ప్రభుత్వ ‘రివర్స్’ నిర్ణయాలను తప్పుపట్టిన పీపీఏ…
ఈ ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం నిర్మాణాన్ని ప్రశ్నార్థ కంగా మార్చడంపై కూడా పీపీఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. 2019 ఆగస్ట్ 13న “ప్రస్తుత కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నందున, కాంట్రాక్ట్ సంస్థ ను మార్చాల్సిన అవసరంలేదని, 2009లో ఇలానే కాంట్రాక్ట్ సంస్థను మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి.” అని చెప్పింది.

మళ్లీ అలాంటి పరిస్థితి వస్తే ప్రాజెక్ట్ నిర్మాణం కలగానే మిగిలిపోతుందని పీపీఏ మొత్తుకుంది. కొత్త కాంట్రాక్టర్ రావడం వల్ల కనీసం 10నెలలు పనులు ఆలస్యమవుతాయని, పనుల్లో జాప్యం జరుగుతుందని, చేసిన పనులకు పాత కాంట్రాక్ట్ సంస్థ బాద్యత వహించదని, కొత్త సంస్థవస్తే జరిగే పనుల్లో జవాబుదారీతనం లోపిస్తుందని చెప్పింది. జగన్ రెడ్డి మూర్ఖంగా ముందుకెళ్లడంతో చివరకు పీపీఏ చెప్పిందే జరిగింది.

టీడీపీప్రభుత్వం దూరదృష్టితో ఆలోచిస్తే, ఇతను మూర్ఖత్వంతో ముందుకెళ్లాడు..
పోలవరం నిర్మాణంలో కీలకమైన తెలంగాణలోని 7 ముంపు మండలాలను ఏపీ లో కలిపేవరకు పట్టుబట్టాను. కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్ సమావేశాలు జరక్కముందే ప్రత్యేక ఆర్డినెన్స్ తో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిపేలా చేశా ను. పోలవరం ఎట్టిపరిస్థితుల్లో నిర్మించాలన్న నా కమిట్ మెంట్ కు అదీ నిద ర్శ నం. అనుభవం, ప్రాజెక్ట్ పై అవగాహన ఉండబట్టే అలా చేయగలిగాను.

ఆ వెను వెంటనే డిజైన్స్ కు క్లియరెన్స్ పొందేలా చేశాను. అదే సమయంలో కోర్టుకేసులు క్లియర్ చేసి, నిర్వాసితులకు పరిహారం అందించి, 5 ఏళ్లల్లో రూ.11,537కోట్లు ఖర్చుపెట్టి, 72 శాతం నిర్మాణం పూర్తి చేయగలిగాను. డీపీఆర్ లో రూ.55,548కో ట్ల ప్రాజెక్ట్ అంచనావ్యయానికి సాంకేతిక కమిటీ అనుమతులు పొందాము. 5ఏళ్ల లో 23 సార్లు పోలవరాన్ని సందర్శించి, పనులపురోగతిపై ఎప్పటికప్పుడు అధి కారులు, కాంట్రాక్ట్ సంస్థతో మాట్లాడాను. 82సార్లు వర్చువల్ గా పనులు పరిశీ లించాను. సోమవారాన్ని పోలవారంగా మార్చి అధికారుల్ని, కాంట్రాక్ట్ సంస్థల్ని పనులకోసం పరుగులు పెట్టించాను.

50 లక్షల క్యూసెక్కుల వరదనీటిని మళ్లించడానికి అత్యంత కీలకమైన డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం చేప్టటాము. దానికి పైన కింద అప్పర్, లోయర్ కాపర్ డ్యామ్ లు ఉండాలి. డయాఫ్రమ్ వాల్ పై నిర్మించే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కు ఇబ్బం ది లేకుండా కాపర్ డ్యామ్ ల నిర్మాణం ప్రారంభించాము. డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ, పీపీఏల అనుమతితోనే ఈపనులన్నీ చేశాం.

రెండుకాపర్ డ్యామ్ లతో పాటు రెండుకిలోమీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తిచేశాం. 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు 24 గంటల్లో పూర్తిచేసి, గిన్నిస్ రికార్డులు సాధించాం. జరిగిన పనుల్ని పీపీఏ పరిశీలించి అన్నీ బాగున్నాయని సర్టిఫై చేసింది. ఇంతలో ప్రభుత్వం మారి, పోలవరానికి గ్రహణం పట్టింది. తండ్రి నిర్వాకంతో ప్రాజెక్ట్ నిర్మాణం పదేళ్లు వెనక్కువెళితే, కొడుకు తప్పిదాలతో మొత్తం మునిగిపోయింది.

ఇప్పుడు జరిగింది తలుచుకుంటే బాధేస్తోంది..
ప్రభుత్వం మారింది.. మొత్తంగా ప్రాజెక్టే రివర్స్ అయ్యింది. ముఖ్యమంత్రి అయిన తొలిరోజునే రివర్స్ టెండర్ అన్నాడు. కాంట్రాక్ట్ సంస్థల్ని వెళ్లగొట్టాడు. 18నెలల పాటు ప్రాజెక్ట్ ప్రాంతంలో అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ఎవరూ లేరు. 2020 డిసెంబర్లో వచ్చిన వరదకు అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్, గైడ్ బండ్ దెబ్బతిన్నాయి. అంతిమంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణమే బీటలు వారింది.

ఆ సమయంలో ఏంజరిగిందో కూడా ఈ ప్రబుద్ధులు గుర్తిచంలేదు. తరువాత ఎప్పుడో ఒకటిన్నర సంవత్సరం తర్వాత మేల్కొన్నారు. ప్రాజెక్ట్ ప్రాంతంలో ఏం జరుగుతోందనే ఇంగితం లేకుండా వ్యవహరించారు. డయాఫ్ర్రమ్ వాల్ ఎక్కడుం దో తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడారు. అంతా నాశనం అయ్యాక, ఇప్పు డు తీరుబడిగా మాపై నిందలేస్తున్నారు. ఇప్పుడు మరలా కొత్తగా డయాఫ్రమ్ కట్టాలంటే రూ.800కోట్లుపైనే అవుతుంది.

మాయమాటలతో నిర్వాసితుల్ని వంచించాడు…
టీడీపీప్రభుత్వం నిర్వాసితులకు రూ.4,114కోట్లు ఖర్చుపెడితే, ఈప్రభుత్వం రూ.1890కోట్లు ఖర్చుపెట్టింది. మేం నిర్వాసితులకు ఇచ్చిన సాయం సరిపోదని, తాను అధికారంలోకి వస్తే పట్టిసీమ నిర్వాసితులతో సమానంగా పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తానన్నాడు. ఎకరాకు రూ.19లక్షల పరిహారం ఇచ్చి, ఇళ్లునిర్మిస్తానన్నాడు. అప్పుడు అలాచెప్పి, ఇప్పుడు కేంద్రమిచ్చే రూ.6.లక్షల కు తోడు తాను రూ.3 లక్షలు ఇస్తానని నాలుక మడతేశాడు.

మరి అప్పుడు అలా ఎందుకు చెప్పావయ్యా అంటే ఎదురుదాడి. మా ప్రభుత్వం సకలవసతుల తో పోలవరం నిర్వాసితులకు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లుకట్టించి ఇస్తే, ఈ నాలుగేళ్లలో ఇతను ఒక్కఇల్లుకట్టలేదు. వారికి ఇవ్వాల్సిన పరిహారాన్ని తన పార్టీవాళ్లకు దోచిపెట్టాడు. నిర్వాసితుల్ని కొండలు, గుట్టలకు వదిలేసి చివరకు వరదసాయం పేరుతో బంగాళాదుంపలు, టమాటాలు పంచిపెట్టాడు. ఈ వానాకా లం అయిపోతే ఈయన ఇంటికే.

ప్రాజెక్ట్ దెబ్బతినడానికి వైసీపీప్రభుత్వమే కారణమన్న నిపుణులు…
ప్రాజెక్ట్ దెబ్బతినడానికి వైసీపీప్రభుత్వ అనాలోచిత చర్యలు, మూర్ఖత్వమే కారణ మని హైదరాబాద్ ఐఐటీ నిపుణుల నివేదిక తేల్చింది. 2020లో వచ్చిన 22 లక్షల క్యూసెక్కుల వరదప్రవాహానికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని, కాపర్ డ్యామ్ నిర్మాణం సకాలంలో పూర్తిచేయనందున, వరదనీరు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వద్దకు వెళ్లి, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదన్నారు. ఐఐటీ నివేదికలో పేర్కొన్న 14 కారణాల్లో ఒక్కకోవిడ్ మినహా 13 కారణాలు వైసీపీప్రభుత్వ వైఫల్యాలే.

ఆంబోతు రంకెలు, కేకలుతప్ప ఈ మంత్రికి డయాఫ్రమ్ వాల్ గురించి తెలియ దు. దాని వెనకున్న ఇతర నిర్మాణాలు, మొత్తంగా ప్రాజెక్ట్ నిర్మాణం గురించే తెలి యదు. 2019లో ఒకసారి వరదొస్తే పట్టించుకోలేదు.. 2020లో మరలా వరదొచ్చి. .. చివరకు జరగరాని నష్ట జరిగింది. దీనిపై ప్రశ్నిస్తే ప్రాజెక్ట్ నిర్మాణం మీరెందు కు చేశారు..

మీరు ఆ డ్యామ్ అక్కడెందుకు కట్టారు.. ఇక్కడెందుకు కట్టారని వితం డ వాదన చేస్తారు. కేంద్రప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వానికి అప్ప గించింది. చంద్రబాబు సమర్థవంతంగా చేస్తాడని నమ్మి అప్పగించింది. మీరు అధి కారంలోకి వస్తారని తెలిసుంటే, అసలు ఇచ్చేవాళ్లు కాదేమో!

ఎప్పుడేం చేయాలో తెలియని ముఖ్యమంత్రి…
45.72 మీటర్ల ఎత్తుతో మేంనిర్మాణాన్ని ప్రారంభిస్తే, ఈయనొచ్చాక 41.15 మీటర్లకు కుదించాడు. ముఖ్యమంత్రే ఎత్తుతగ్గిస్తే, డబ్బులివ్వాల్సిన కేంద్ర ప్రభు త్వం సరేనంటుంది. వాళ్లదేం పోయింది..నష్టపోయేది రాష్ట్రమేగా? నాలుగేళ్లలో పోలవరానికి రూ.4,611కోట్లు ఖర్చుపెట్టినట్టుచెబుతున్నాడు. ఆ డబ్బు కూడా టీడీపీ హాయాంలో చేసిన పనులకు సంబంధించి కేంద్రమిచ్చినవే. వాటిని సక్ర మంగా పనులకోసం ఖర్చుచేయలేదు. చచ్చీచెడి 4శాతంపనులు చేశాడు.

ప్రాజెక్ట్ సంద్శనకు ఎవరినీ అనుమతించకుండా ఆ ప్రాంతాన్నినిషేధిత ప్రాంతంగా మార్చాడు. మా హాయాంలో బస్సులుపెట్టి జనాల్ని తీసుకెళ్లి ప్రాజెక్ట్ పనులు చూపిం చాం. వరదలు వచ్చి నిర్వాసితులు కొండలు, గుట్టలెక్కితే వారి ముఖం చూడటా నికి ముఖ్యమంత్రికి తీరికలేదు. ఎప్పుడు ఏంచేయాలో తెలియని ఇతనితో మొత్తా నికి ప్రాజెక్ట్ నిర్మాణం మొత్తం గోదావరి పాలైంది. అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ప్రతిపక్షనేతగా ఉండి కూడా పోలవరం పనులకు అడ్డుతగిలాడు.

ప్రాజెక్టుకి సం బంధించి కోర్టులోఉన్న కేసుల్లో మోకాలడ్డాడు. 2010-11 ధరల ప్రకారం ప్రాజెక్ట్ అంచనాలు ఆమోదించాలని, ఎక్కువ ఇవ్వవద్దని ఆ రోజుల్లో ఢిల్లీలో లాబీయింగ్ జరిపాడు. అబద్ధాలు, అసత్యాలతో పోలవరంపై పుస్తకాలు ముద్రించాడు. ఇతను చేసిందంతా దుష్ప్రచారమని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రులే చెప్పారు.

ఇప్పటి కైనా వితండవాదం..రంకెలేయడం మాని, చేసినతప్పుల్ని బేషరుతుగా ఒప్పుకొ ని చెంపలేసుకోండి. క్షమించరాని నేరంచేసి జాతిద్రోహానికి పాల్పడ్డారు. మీ చేతగా నితనం వల్ల రాష్ట్రం మునిగిపోయిందన్నదే నా బాధ, ఆవేదనంతా.

పోలవరం నిర్మాణంపై ఎన్నిసార్లు నాలుకమడతేశాడో…
పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అంటే 2021 ఏప్రియల్.. జూన్ అన్నాడు… తరువాత 2021 డిసెంబర్.. 2022 ఖరీఫ్ (ఏప్రియల్)… 2022 డిసెంబర్ ఇలా నోటికొచ్చిన తేదీఅల్లా చెప్పాడు. 2023 ఖరీఫ్ అన్నాడు. ప్రాజెక్ట్ మంచి స్పీడు లో జరుగుతోంది.. బాగా పనులు జరుగుతున్నాయని చెప్పాడు. క్రెడిబులి టీ అనేది చేసేపనులతో వస్తుందన్నాడు.

ఇదేనా ఈయన క్రెడిబులిటీ? గతంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఆయన పర్సంటా.. అరపర్సంటా అంటూ మరీ రెచ్చిపోయా డు.. ఇప్పుడున్న ఆయన ఆంబోతులా రంకెలేస్తాడు. మేం ఎప్పుడూ తేదీ, సంవత్సరం చెప్పలేదన్నాడు. 2021 డిసెంబర్ కి పూర్తి అవుతుందని విజయ సాయి రెడ్డి చెప్పాడు. వీళ్లకంటే జోకర్లే నయం.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు..

పట్టిసీమ ఎత్తిపోతల పథకం…
పట్టిసీమను 2016లో ప్రారంభించి, రూ.1655.90 కోట్లతో పూర్తిచేశాం. కృష్ణాడె ల్టాకు గోదావరి నీళ్లు అందించాం. పట్టిసీమ నిర్వహణకోసం రూ.390కోట్లు కేటా యించిన ఈప్రభుత్వం ఆ నిధుల్ని కూడా సక్రమంగా వినియోగించలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్లో నీటినిల్వపై శ్రద్ధపెట్టలేదు. దాంతో రాయలసీమకు నీళ్లు ఇవ్వలే ని దుస్థితిలో ఉన్నారు.

చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్….
3 దశల్లో 53.50టీఎంసీల గోదావరినీటిని ఎత్తిపోసేలా ఈప్రాజెక్ట్ నిర్మాణం చేప ట్టాం. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 4.80లక్షల ఎకరాలకు సాగునీరు, కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 6 మండలాలకు తాగునీరు అందింవచ్చు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.4,909కోట్లు. టీడీపీహాయాంలో రూ.2,289కోట్లు ఖర్చుపెడి తే, ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం రూ.650కోట్లు పెట్టింది. 699ఎకరాల భూసేకర ణ పనుల్ని ఆపేశారు. కోర్టుకేసుల్ని పరిష్కరించలేదు. మొత్తం ర.143 కోట్లు కాంట్రాక్టర్లకు బకాయిపెట్టారు. ప్రాజెక్ట్ పూర్తికి రూ.9,500కోట్లు అదనపు అంచనాలు రూపొందించారు.

గోదావరి డెల్టా…
వరదముంపు నివారణకు టీడీపీప్రభుత్వం రూ.236.66కోట్లు ఖర్చుపెడితే, ఈ ప్రభుత్వం కేవలం 6.85కోట్లు ఖర్చుపెట్టింది. అలానే గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులకు టీడీపీహాయాంలో రూ.813కోట్లు ఖర్చుపెట్టాం.. వీళ్లు నాలుగేళ్లలో కేవ లం రూ.123కోట్లు మాత్రమే పెట్టారు. కొవ్వాడ కాలువ పనులకోసం టీడీపీ హా యాంలో రూ.64కోట్లు ఖర్చుపెట్టాం. ఈప్రభుత్వం కేవలం రూ.1కోటి మాత్రమే పెట్టింది. దీన్నిబట్టే ఈ ప్రభుత్వప్రాధాన్యత ఏమిటో అర్థంచేసుకోవచ్చు.

ఎర్రకాలువ ఆధునికీకరణ…
మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.143.16కోట్లు. వరద ముంపు ప్రవాహాన్ని 5 వేల క్యూసెక్కుల నుంచి 20,290క్యూసెక్కులకు పెంచాం. దీనివల్ల పశ్చిమ గోదావరిజిల్లాలో 34,364 ఎకరాలకు లబ్ది కలుగుతుంది. 08-01-2018లో ప్రారం భించి, రూ.104కోట్లు ఖర్చుపెట్టాం. వైసీపీవచ్చాక గట్లపూడిక కోసం రూ.30కోట్లు ఖర్చుపెట్టలేక చేతులెత్తేసింది.

పోగొండ రిజర్వాయర్…
అంచనావ్యయం రూ.129కోట్లు. 19-02-2018న ప్రారంభించాం. ఆయకట్టు 4వేల ఎకరాలు. టీడీపీహాయాంలో రూ.85 కోట్లతో రిజర్వాయర్ నిర్మించాం. ఈ ప్రభుత్వం వచ్చాక కాలువల నిర్మాణ పనులు ఆపేసింది.”

LEAVE A RESPONSE