Suryaa.co.in

Andhra Pradesh

కొత్త జిల్లా ఏర్పాటుకు వడివడిగా అడుగులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లా ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. నూతన జిల్లాల ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. బుధవారం వర్చువల్‌గా సమావేశమైన కేబినెట్.. రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 26 జిల్లాలతో పాటు 70 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఏప్రిల్‌ 4న ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

కొత్తగా పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య జిల్లా, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం రెవెన్యూ డివిజన్‌గా మారనుంది. అదేవిధంగా పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, నగరి, శ్రీకాళహస్తిలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు.

LEAVE A RESPONSE