వేద పరిషత్ పక్కనే “ముస్లీం హలీం సెంటర్”

Spread the love

– వేద సంస్కృతి పై దాడి
– చైతన్య వేదిక

గుంటూరులోని బ్రాడీపేట ప్రధాన రహదారి 4వ లైన్ 12వ క్రాస్ వద్ద మెయిన్ రోడ్ వద్ద ఉన్న “గుంటూరు మండల వేద విద్వత్ పరిషత్” ద్వారా అనేక మంది వేద విద్యార్థులను తీర్చిదిద్దుతూ, పురాణ ప్రవచనాలపై శిక్షణ అందించే ఈ భవనం పక్కనే ముస్లీం మాంసం హలీం దుకాణాన్ని తెరవడం వల్ల స్థానికంగా వుండే ఆధ్యాత్మిక వాదులకు ఇబ్బంది ఏర్పడింది. హోటల్ బాబు హైదరాబాద్ హలీమ్ సెంటర్ ను 4/12 బ్రాడిపేట, మెయిన్ రోడ్ మీదే నిన్న మంగళవారం ప్రారంభించారు. ఇది స్థానికుల మనోభావాల్ని విధ్వంసం సృష్టిస్తోంది.

హిందూ ధర్మాన్ని మరియు వేద విద్యను ప్రచారం చేయడం కోసం ఆ రోజుల్లో అప్పయ్య స్వామి అనే ప్రముఖ వేద పండితునిచే స్థాపించబడింది ఈ అప్పయ్య మఠం. దాదాపు వందేళ్లకు పైగా స్థాపించబడిన ఈ “వేద విద్వత్ పరిషత్‌”కు ఆనుకుని, అత్యదికంగా బ్రాహ్మణ సమాజం నివాసం ఉన్న ప్రాంతంలోనే కావాలనే సింధుర హోటల్ పార్ట్నర్ అయిన ఓ రెడ్డి గారు ఈ హలీమ్ దుకాణం ఏర్పాటు చేశారు. దాని కారణంగా ఆధ్యాత్మిక నాగరికత గల ఇక్కడి ప్రజలందరూ మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు.

ఆ వేద భవనంలో ప్రతిరోజూ పురాణ ప్రవచనాలు జరుగుతుంటాయి. కొత్తగా తెరిచిన ఈ మాసం హలీమ్ దుకాణాన్ని దృష్టిలో ఉంచుకుని భక్త జనాలు అక్కడికి రావడానికి వెనుకాడుతున్నారు, ఈ హలీం సెంటర్ వల్ల మతపరమైన హింస లేదా మతపరమైన విఘాతానికి దారితీస్తుందని ఇక్కడి స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు మరియు హిందుత్వ వాదులు, రాజకీయ పార్టీలు మరియు సోషల్ మీడియా పులులు ఈ సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి ఈ సమస్యను పరిష్కరించాలి.

పైన పేర్కొన్న ఈ హలీం దుకాణాన్ని ఇక్కడి నుండి తక్షణమే తొలగించాలి. లేకుంటే స్థానిక ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. సమాజం యొక్క ఆరోగ్యకరమైన వాతావరణానికి ఇది మంచిది కాదు. కావున ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి అనుమతులు ఇచ్చిన మున్సిపల్ అధికారుల పై తక్షణమే చర్య తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాము.

Leave a Reply