-గులకరాయి డ్రామా వెనుక వెల్లంపల్లి, కేశినేని…
-ఓటమి భయంతో మరో బీసీ బిడ్డను బలి చేసే కుట్ర
-టీడీపీ నేత బొండా ఉమాను ఇరికించేందుకు యత్నం
-కూటమి అధికారంలోకి వస్తే సీబీఐతో దర్యాప్తు చేయిస్తాం
-సహకరించిన అధికారులను ఇంటికి పంపుతాం
-టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని గ్రహించి ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జగన్ రెడ్డి, అతని దొంగల ముఠా రూపొందించిన డ్రామానే గులకరాయి నాటకమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాల యంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ డ్రామాలను చూసి జనం నవ్వుకుంటున్నారని, 2019 ఎన్నికలకు ముందు కోడి కత్తి డ్రామాతో దళిత బిడ్డను బలిచేసి కోడికత్తి శీనును ఐదేళ్లు జైల్లో మగ్గేలా చేశారని, ఇప్పుడు గులక రాయి డ్రామాలో కూడా బీసీ వర్గానికి చెందిన వడ్డెర కులస్తులను దాదాపు పది మంది పిల్లలను బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి చిత్ర హింసలకు గురి చేస్తున్నారన్నారు. విజయవాడ సీపీ ఆధ్వర్యంలో ఈ అక్రమ అరెస్టులు జరిగాయన్నారు. టీడీపీలో చేరిన దుర్గారావును అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తున్నట్లు తెలిసిందన్నారు.
వారిద్దరిని గెలిపించేందుకే బొండాపై కుట్ర
వైసీపీ అరాచాకాలపై పోరాడుతున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహే శ్వరరావును గులకరాయి డ్రామాలో ఇరికించేందుకు పోలీస్ శాఖ డీజీ, ఇంటెలిజెన్స్ అధికారి సీతారా మాంజనేయులు, విజయవాడ కమిషనర్‌లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ డైరెక్షన్‌లో ఈ కుట్రలో ప్రధానపాత్ర పోషించిన వ్యక్తి వెల్లంపల్లి అన్నారు. విజయవాడ వెస్ట్‌ను పూర్తిగా దోచుకున్న ఈ దుర్మార్గుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి చేయని అక్రమాలు లేవన్నారు. విజయ వాడ వెస్ట్‌లో పనికి రాని చెత్తను సెంట్రల్‌కు తెచ్చి నిలబెట్టాడు. ఆయనను గెలిపించేందుకు సానుభూతి కోసం కుట్ర చేశాడని ఆరోపించారు.
మరో వైపు కేశినేని నాని శ్రీరామ్ ఫైనాన్స్‌కు చేసిన మోసం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు టోపీ పెట్టే ప్రయత్నం, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టిన వైనం.. ఎవరికి తెలియవని దుయ్యబట్టారు. ఇటువంటి చీటర్లను పెట్టుకుని బొండా ఉమామహే శ్వరరావు, కేశినేని చిన్నిలపై గెలిచేందుకు జగన్ కుట్రకు తెరలేపారని విమర్శించారు. విజయవాడ కమిషనర్ క్రాంతి ఠాణా ప్రెస్‌మీట్ ఒక జబర్దస్ కామెడీ షో కింద మారిపోయిందని, ఇటువంటి డ్రామాల్లో పాత్రధారులు అవ్వడం సిగ్గుచేటన్నారు. ఖచ్చితంగా వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే ఎవరినీ వదిలిపెట్టేది లేదని హితవుపలికారు. వైసీపీకి కొమ్ముకాస్తున్న అధికారులు ఇకనైనా మారాలని పట్టాభి హెచ్చరించారు. బీసీ బిడ్డ అమర్నాథ్‌ను ఏ విధంగా పెట్రోల్ పోసి తగలబెట్టారో… ఒక దళిత బిడ్డ కిరణ్ చావుకు ఏ రకంగా కారణం అయ్యారో.. ఒక మైనార్టీ బిడ్డ మిస్బా చావుకు ఏ రకంగా కారణం అయ్యారో ప్రజలు మరచిపోలేదని, బలహీన వర్గాలు వైసీపీకి బుద్ధి చెబుతాయని పట్టాభి స్పష్టం చేశారు. విజయవాడ వెస్ట్‌లో వెల్లంపల్లికి, కేశినేనికి బొండానే సరైన మొగుడని వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.