అందఱికీ వాపులూ, నొప్పులూ కలిగి నిలిచి ఉన్నాయి.
రాళ్లు ఎవరు విసిరారు? ఎప్పుడు విసిరారు? సరిగ్గా తెలియరావడం లేదు.
కొందఱు ఆ విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కొందఱు రాళ్ల గుఱించి ఆలోచిస్తున్నారు. కొందఱు వాపుల్నీ, నొప్పుల్నీ విశ్లేషిస్తున్నారు. మఱి కొందఱు వాపు, నొప్పులకు వైద్యం చేస్తున్నారు. మంచి వాళ్లు కొందఱు మెఱుగైన వైద్యం కోసం అన్వేషిస్తున్నారు.
రాళ్లు పడ్డాయి…
మతం, కులం, వర్గం, ఇజం, ప్రాంతం, విభేదాలు-
దెబ్బలు తగిలాయి…
దాడులూ, దారుణాలూ, హత్యలూ, మారణ కాండలూ-
సమాజం నుంచి రక్తం కాఱుతోంది, కన్నీరు ఊఱుతోంది. నేలంతా తడుస్తోంది. ఆకాశం అవాక్కయిపోయింది.
చాలా కాలంగా పరిస్థితి ఇలాగే ఉంది. భవిష్యత్తులోనూ పరిస్థితి ఇలాగే ఉంటుంది.
గాలి, నీరు, నిప్పు విజృంభించాలి.
ఇంతవఱకూ రాని విప్లవం విప్లవంగా విస్ఫోటనం చెందాలి.
పొంగి, పొంగి నిజమైన ప్రళయం రావాలి.
ఈ పుడమిపై ఒక్కసారైనా ప్రశాంతత వీచాలి.
కవీ,
నీ నుంచి కవిత్వం రావాలి.
– రోచిష్మాన్
9444012279