-ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు కృషి చేయండి
-నూతన డిజిపి హరీష్ కుమార్ గుప్తా ను కలిసిన ఎన్నికల నిఘా వేదిక
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లు చూడాలని, ప్రజలకు రక్షణ కల్పించాలని, తప్పులు చేసిన వారిని ఎవరినీ ఉపేక్షించరాదని, నిబద్ధతతో, నిజాయితీతో ప్రజాస్వామ్యహితంగా పోలీస్ యంత్రాంగాన్ని నడిపించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, పూర్వ విజయవాడ నగర మేయర్ జంధ్యాల శంకర్ నూతనంగా నియమించబడిన డిజిపి హరీష్ కుమార్ గుప్తాను డిజిపి రాష్ట్ర కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించారు.
ఇటీవల మచిలీపట్నం, పెనమలూరు లో దళిత కాలనీలో జరిగిన దాడులను డిజీపీ దృష్టికి తీసుకుని వచ్చి బాధ్యులు పై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కోరారు. పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, చట్టబద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 13 ఉమ్మడి జిల్లాలలో ఎన్నికల నిఘా వేదిక ఏర్పడి సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ రిటైర్డ్ అధికారులు సమన్వయకర్తలుగా ఉండి క్షేత్రస్థాయిలో ఎన్నికల అక్రమాలను నివారించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
డిజిపి హరీష్ కుమార్ గుప్తా సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి తోడ్పడుతామని, ప్రజాస్వామ్యబద్దంగా చ ట్టబద్ధంగా కృషి చేస్తామని, తప్పు చేసిన వారు ఏ స్థాయిలో ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు .