Suryaa.co.in

Andhra Pradesh Features

పోరాటాలపై విష ప్రచారం ఆపండి..

PRC లోని అసంబద్ధతను సరిచేయాలని ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ఉద్యోగులు ఇంకా ఎక్కాల్సి ఉంది. వైసీపీ నిజరూపం బయట పడింది. వారి సోషల్ మీడియా విభాగం రెచ్చిపోతున్నది. తన వికృత సవాళ్ళన్ని తెర మీదికి తోస్తున్నది.తాము తినడానికే లేక పన్నులు కడుతూ ఉంటే ఆ సొమ్ముతో ఉపాధ్యాయులు జీతాలు తీసుకుంటున్నారని… అంటే వైసీపీ వారొక్కరే పన్నులు కడుతున్నారా!

ఉపాధ్యాయులకు PRC అసంబద్ధత సరి చేయమన్నవుడే కడుతున్న పన్ను గుర్తుకొచ్చిందా. వైసీపీ ప్రభుత్వం అదే పనిగా పన్నులు, చెత్త పన్ను, విద్యుత్ బిల్లులు, బస్సు ఛార్జీలు, పెట్రో ఉత్పత్తులుపై
teachers పన్ను పెంచుకుంటూ పోతుంటే నోరడి పోయిందా, అప్పుడేందుకు మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచుకుంటూ పోతు ఉంటే ఎందుకు నోరెత్తలేదు..మొత్తం ఉద్యోగుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, టైం స్కేల్, సచివాలయం, వలంటీర్లు కలిపి 9 లక్షల మంది ఉన్నారు.

PRC లెక్కలొకే రాని అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం కార్యకరర్తలు, పంచాయతీ వర్మర్లు ఇలాంటి వారు మరో 5 లక్షలున్నారు. ఈ పద్నాలుగు లక్షల మంది, సరాసరి జీతం 12 వేల రూపాయలు మాత్రమే.
ఈ సంగతి వైసీపీ కార్యకర్తలకు తెలియదా!ఉపాధ్యాయులు,ఉద్యోగులు లక్షల్లో వేతనాలు పొందుతున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. మొత్తం ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో 50 వేల రూపాయల వేతనం దాటిన వారు లక్ష మంది ఉండగా, పై చెప్పిన 13 లక్షల మంది సగటు వేతనం 15 వేల రూపాయల లోపే.
ఉపాధ్యాయుల పిల్లలు ప్రైవేటు స్కూల్లో చదువుతున్నారని మరో అక్కసు.

జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ చదివారు, ఆయన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు. ఎందుకని విదేశాల్లో చదువుతున్నారు. భారతీయ పాఠశాల లు పనికి రావా?ఎవరి స్థోమతును బట్టి, భవిష్యత్ అంచనాలను బట్టి వాళ్ళ పిల్లలని, చదివించుకుంటారు. దీనిపై మీ అక్కసు దేనికి?అధిక వేతనాన్ని పొందుతున్నారని వాపోతున్నారే… MLA జీతం రెండున్నర లక్షలా, మంత్రి జీతం నాలుగు లక్షలా, ఏ ధైర్యంతో తీసుకుంటున్నారు. మంత్రి రోజు వేతనం సుమారుగా 17 వేలు, ఇంతింత మొత్తం అప్పనంగా బొక్కుతా ఉంటే, ఖండించాలని ఈ వైసీపీ కార్యకర్తకు బుర్ర పని చేయలేదా?

కోట్లాది ఆంధ్ర ప్రజలకు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేనే లేదే. ఒక్కో MLA 50 వేల పెన్షన్ పొందుతుంటే ఈ వైసీపీ కార్యకర్తలకు జిమ్మడి పోయిందా. అందరికీ అదే పెన్షన్ ఇప్పించాలని ఎందుకు అనిపించలేదు.ప్రతి MLA ఐదేళ్లు భద్రంగా శాసన సభ్యుడిగా వెలగ బెడుతున్నారే. మరి పైన చెప్పిన లక్షల సంఖ్య ఉద్యోగులకు భద్రతే లేదే. ఎందుకు పెర్మనెంట్ చేయరు.ఆవిషయం, ఈ వైసీపీ కార్యకర్త లెందుకు అడగరూ?

ఉపాధ్యాయులు అవినీతి పరులంటూ అధికార పార్టీ వారు నిప్పులు కక్కుతున్నారు. ఆ నిప్పులు సిన్సియర్ గా కక్కండి, అప్పుడు మీ ముఖ్యమంత్రి ఏ జైల్లో ఉంటారో ఆయనకి మీకు కూడా తెలియదు. ఉద్యోగులూ అక్కడక్కడా అవినీతికి పాల్పడుతున్నారు, ఇది వాస్తవమే. మీకు చేతనయితే, పట్టుకో, శిక్షించుకో. వాళ్ళ వద్ద పెర్సెంటేజ్ ముట్టుకోకు. మీకు దమ్ముంటే అందరిని పట్టుకో ఎవ్వరిని వదలవద్దు, MLA, మంత్రి వారి ఆస్తులు బయటకు తీయి.వీరంగ మాడుతున్న వైసీపీ కార్యకర్తలారా! మీ మెదడు సరిగా పనిచేస్తే, పైన రాసిన ప్రతి అంశాన్ని మీరు అంగీకరించాలి, పోనీ కొన్ని అంగీకరిస్తారా, అంగీకరించే వాటికోసం కలిసొస్తారా!

– రామ్మోహన్, జర్నలిస్టు

LEAVE A RESPONSE