-సెలవులపై లిటిల్ ఫ్లవర్ స్కూల్ వింత నిర్ణయం
-కేవలం సోమవారానికి సెలవు ప్రకటించిన యాజమాన్యం
-వర్షం కొనసాగితే మంగళవారం ఫోన్లో సందేశం పంపిస్తామన్న ప్రిన్సిపల్
-సీఎం జారీచేసిన ఆదేశాలు పాటించుకొని బ్రదర్ అంథోని
-ఉన్నతాధికారులు తక్షణం స్పందించాలని కోరుతున్న తల్లిదండ్రులు
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుని.. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్వయాన ప్రకటించారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్, పులువురు ఉన్నతాధికారులతో వర్షాలపై వాతావరణంపై చర్చించారు.
ఈ నేపథ్యంలో స్థానిక ఆబిడ్స్ లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ శాజన్ సెలవులపై వింత నిర్ణయం తీసుకొని ఇటు తల్లిదండ్రులకు మరియు అటు విద్యార్థులను ఆశ్చర్యానికి గిరిచేశారు. కేవలం సోమవారంనాడు మాత్రమే సెలవు ప్రకటించి , ఒకవేళ మంగళవారం వర్షం ఉండని యడల స్కూల్ యధావిధిగా నడుస్తుందని ఫోన్లో సందేశాన్ని పంపించారు. కాగా మంగళవారం వర్షం ఉంటే మళ్ళీ విద్య్రర్డులకు సెలవు ప్రకటిస్తామని సందేశంలో రాసారు.
రాష్ట్ర ప్రభుత్వం అందులో రాష్ట్ర సిఎం కేసీఆర్ సంబంధిత అధికారులతో సమీక్షించి సెలవుపై నిర్ణయం తీసుకొని వాతావరణ శాఖ, మరియు ఉన్నత విద్య అధికారులు సెలవుపై స్పష్టంగా ఆదేశాలు జారిచేయించినా కూడా పేరు మోసిన విద్యాసంస్థ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతే కాకుండా రాష్ట్ర సి ఎం ఆదేశాలను స్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ అంథోని షజాన్ బేఖాతర్ చేసినట్లు స్పష్టంగా కనబడింది. ఈ విషయంపై కొందరు తల్లిదండ్రులు స్కూల్ ఆఫీస్ కి ఫోన్ చెయ్యగా స్పందింలేదు. మొత్తానికి లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరించడం ,ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ వెయ్యడంపై ఉన్నతాధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.