Suryaa.co.in

Andhra Pradesh

శక్తి కేంద్రాలను బలోపేతం చేయండి

-కేంద్ర పథకాలు ప్రచారం చేయండి
-బూత్‌ కమిటీలతో పార్టీ పటిష్ఠం
-బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి

గుంటూరు పార్లమెంట్ శక్తి కేంద్ర ప్రముఖుల మరియు పోలింగ్ బూత్ స్థాయి సమావేశం బండ్లమూడి గార్డెన్స్ లో జరిగింది ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొని శక్తి కేంద్రాల ప్రముఖులకు ఆ పైస్థాయి నాయకులందరికీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల సమయానికి భారతీయ జనతాపార్టీ నాయకులుగా మనమంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. బీజేపీ సంస్థాగతంగా ఏవైతే చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయో వాటిని బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి కార్యక్రమం తీసుకువెళ్లాలని సూచించారు.

మన్ కీ బాత్ సమయంలో మోడీ చెప్తున్న అంశాల పైన పూర్తిస్థాయిలో అందరికీ వివరించాలని స్థానిక అంశాలను అదేవిధంగా సమస్యలను దేశ అంశాలను అన్ని కూలంకషంగా చర్చించి ప్రతి ఒక్కరూ పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని సూచించారు పార్టీలో 9 సంవత్సరాలుగా ఏర్పాటు చేసిన అనేక స్కీములు గురించి ప్రతి ఇంటికి తెలియచేయడం వారింట్లో లబ్ధిదారులను గుర్తించి ఆలబ్ది చేకూరేందుకు కావలసిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బూత్ స్థాయిలో కార్యకర్తలను నియమించు కున్నట్లయితే వారు ప్రతి ఒక్క బూతు సభ్యులను ఓటర్లను కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులుగా చేయడానికి కేంద్రం ఇస్తున్న అన్ని పథకాలు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా చేస్తున్న సంక్షేమం సబ్ కా వికాస్ అనే లక్ష్యంతో సాగుతోంది దానిని సబ్ కా ప్రయాస్ మన అందరి వినియోగం వినియోగించుకునే లబ్ధిదారులకు తెలియజేయడానికి ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా 25 ఏళ్లని వారి సంక్షేమాన్ని చూడాలని ఉద్దేశం చేశారు. కేంద్రం వచ్చే ఐదు సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాలను ఫలాలను ఇంటింటికి చేర్చడంలో మన వంతు బాధ్యత మనం చేయాలని సూచించారు

సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్సులు సన్న దయాకర్ రెడ్డి, బిట్ర శివన్నారాయణ, జిల్లా ఇంచార్జి శ్రీనివాసరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, రాష్ట్ర కార్యాలయ ఇంచార్జి మకుటం శివ, టుబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్వరూపరాణి, ఈదర శ్రీనివాసరెడ్డి, శనక్కాయల అరుణ, తులసి రామచంద్ర ప్రభు, ప్రవాస్ రాష్ట్ర కో కన్వీనర్ మాగంటి సుధాకర్, జిల్లా ప్రవాస్ సంయోజక్ భీమినేని చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్సులు కుమార్ గౌడ్, తిరుపతిరావు, వైవీ సుబ్బారావు, ఉమా మహేశ్వరావు మరియు శక్తికేంద్ర ప్రముఖులు, పోలింగ్ బూతు అధ్యక్షులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE