పోస్ట్మార్టం కోసం డాక్టర్ డబ్బులు డిమాండ్ చేసిన ఘటనపై మంత్రి విడదల రజిని స్పందించారు. లంచం డిమాండ్ చేసిన డాక్టర్ సంధాని బాషాపై చర్యలు తప్పవన్న ఆమె పోస్ట్మార్టం కోసం ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఘటనపై మంత్రి విడదల రజిని స్పందించారు. రూ.16 వేలు లంచం డిమాండ్ చేసిన డాక్టర్ సంధాని బాషాపై చర్యలు తప్పవన్నారు. పోస్టుమార్టం కోసం లంచం డిమాండ్ చేయడం అమానవీయమన్నారు. సమాచారం రాగానే మెడికల్ ఆఫీసర్ బాషాను సస్పెండ్ చేశామని తెలిపారు. పోస్టుమార్టం కోసం ఏ వైద్యుడికి కూడా డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. అధికారులపై ఆరోపణలు వస్తే ఉపేక్షించబోమని… వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి రజిని స్పష్టం చేశారు.