Suryaa.co.in

Andhra Pradesh

మీ తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటా …

  • లేపాక్షి ఎంజేపీ హాస్టల్ సిబ్బందిపై మంత్రి ఎస్.సవిత ఫైర్
  • హాస్టల్ లో మంత్రి ఆకస్మిక తనిఖీలు
  • బాత్ రూమ్ ల్లో అపరిశుభ్ర వాతారణంపై మండిపాటు
  • బియ్యంలో పురుగులపైనా తీవ్ర ఆగ్రహం
  • రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యంపైనా మంత్రి అసహనం
  • ఏ సమస్య ఉన్నా స్వయంగా నాకు ఫోన్ చేయండి 
  • విద్యార్థులకు మంత్రి సవిత సూచన

హిందూపురం : మీ ఇళ్లల్లో పిల్లలను అపరిశుభ్రమైన వాతావరణంలో పెంచుతారా…పురుగుల అన్నం పెడతారా..? మీ తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని లేపాక్షి ఎంజేపీ బీసీ సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ పారిశుద్ధ్య సిబ్బందిని, వార్డెన్ ను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్. సవిత హెచ్చరించారు. సత్యసాయి జిల్లా హిందూపురంలోని లేపాక్షి ఎంజేపీ బీసీ సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ మంత్రి సవిత సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్ అంతా కలియ తిరిగారు. అన్ని గదులను, బాత్ రూమ్ లను మంత్రి పరిశీలించారు. బాత్ రూమ్ లకు డోర్లతో పాటు విద్యుత్ సదుపాయం కూడా లేకపోవడంపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. బాత్ రూమ్ లు చుట్టు పక్కల అపరిశుభ్ర వాతావరణం ఉండడం పైనా పారిశుధ్య సిబ్బందిపై మంత్రి ఫైర్ అయ్యారు.

తాగునీటి ట్యాంకులు కూడా అపరిశుభ్రంగా ఉండడంపైనా మండిపడ్డారు. మీ ఇళ్లల్లో ఇలాగే ఉంచుతారా… మీ పిల్లలను ఇలాగే పెంచుతున్నారా ? అంటూ పారిశుద్ధ్య సిబ్బందిని నిలదీశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వార్డెన్ కు మంత్రి ఆదేశించారు. హాస్టల్ లో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వాలని, ఎప్పటికప్పుడు వేడి ఆహారం వండి పెట్టాలని వార్డెన్ కు స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలున్నప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించాలన్నారు. బయట ఆహారాన్ని హాస్టల్ లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దన్నారు. విద్యార్థులను ఇంట్లో పిల్లల మాదిరిగా చూసుకోవాలని వార్డెన్ కు స్పష్టంచేశారు.

గదుల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేయండి …

అనంతరం మంత్రి సవిత స్టోర్ రూమ్ ను పరిశీలించారు. స్టోర్ రూమ్ లో రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడంపై ఆమె అసహనం వ్యక్తంచేశారు. స్టాక్ రిజిస్టర్లలో సరుకుల వివరాలు చూపకపోవడంపై మండిపడ్డారు. ఇలాగేనా రికార్డులు నిర్వహించేదని వార్డెన్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. బియ్యం బస్తాలను పరిశీలించగా పురుగులు ఉండడాన్ని మంత్రి గమనించారు. ఇటువంటి బియ్యాన్నా… పిల్లలకు వండి పెడుతున్నారు..? అని వార్డెన్ పై ఫైర్ అయ్యారు. మంచి బియ్యం తీసుకొచ్చి, విద్యార్థులకు వండిపెట్టాలని ఆదేశించారు. రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, స్టాక్ రిజిస్టర్లలో సరుకులు వివరాలు ఎప్పటికప్పుడు పొందుపర్చాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం తరగతుల గదులతో పాటు విద్యార్థులు విశ్రాంతి తీసుకునే హాస్టల్ గదులను మంత్రి సవిత పరిశీలించారు. హాస్టల్ గదుల్లో విద్యుత్ సదుపాయంతో పాటు ఫ్యాన్లు లేకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గాలి, వెలుతురు లేకుండా విద్యార్థులు ఎలా పడుకుంటారని వార్డెన్ ను నిలదీశారు. తక్షణమే గదుల్లో ఫ్యాన్లు, విద్యుత్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు.

భయంలేకుండా నాకు ఫిర్యాదు చేయండి

తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులతో మంత్రి సవిత మాట్లాడారు. భోజనం సరిగ్గా పెడుతున్నారా… చదువు బాగా చెబుతున్నారా..? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా తనతో చెప్పాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. సమస్యలను స్వయంగా చెప్పలేకపోతో… తన ఫోన్ నెంబర్ కు కాల్ చెప్పాలని విద్యార్థులకు మంత్రి ఫోన్ నెంబర్ ఇచ్చారు. భయం లేకుండా ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియుపెన్నులు అందజేసిన మంత్రి సవితమ్మ గారు. కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE