– గురుకులాల ‘ముస్తాబు’ మీకోసమే
– మీ భవిష్యత్తు కోసమే చంద్రబాబు కలలు
– పాఠశాలలు శుభ్రంగా ఉంచే బాధ్యత మీదే
– విద్యార్ధులతో కలసి భోజనం చేసిన మంత్రి సవిత
మచిలీపట్నం: విద్యార్థులు బాగా చదువుకోవడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కూడా పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత పిలుపునిచ్చారు.
సోమవారం అవనిగడ్డ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మోపిదేవి లో మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, బీసీ సంక్షేమ వసతి గృహంలలో ముస్తాబు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన అద్దం, దువ్వెన, చేతులు శుభ్రం చేసుకొనే వాష్ బేసిన్ మంత్రి పరిశీలించారు. తదుపరి పాఠశాల, వసతి గృహంలలో చుట్టూ కలియతిరిగి వంట గదులు, ఆర్వో ప్లాంట్ , స్నానపు గదులు, మరుగుదొడ్లు, టీవీలో ముస్తాబు కార్యక్రమం మంత్రి పరిశీలించారు.
అంతేకాకుండా ప్రతి ఒక్క విద్యార్థికి దగ్గరకు వెళ్లి వారి వ్యక్తిగత పరిశుభ్రతను, చేతి గోర్లు తీసుకుంటున్నారా లేదా గమనిస్తూ, ఏం చదువుతున్నారు, ఏకరూప దుస్తులు ఎలా ఉన్నాయి? భోజనం ఎలా ఉంటుంది, ఎలా చదువుకుంటున్నావు? తల్లికి వందనం అందుతుందా లేదా ఆరోగ్యం ఎలా ఉంది, ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారా లేదా ఎన్నిసార్లు చేస్తున్నారు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని మంత్రివర్యులు అడిగి తెలుసుకుంటూ సంతృప్తి వ్యక్తం చేశారు.
బీసీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని అల్పాహారం, చిక్కి రుచి చూశారు. పులిహోర సరిగా చేయడం లేదని, మరింత మెరుగ్గా ఆహారం తయారు చేయాలని మంత్రి వంటవారిని ఆదేశించారు.
ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా బీసీ.గురుకుల పాఠశాల అంటేనే ఒక బ్రాండ్ అని ఎం జె పి లో సీటు దొరకాలంటే చాలా డిమాండ్ ఉందన్నారు. ఎం జె పి లో నాణ్యమైన విద్య, భోజనము అందించడంతోపాటు జాగ్రత్తలు పాటిస్తున్నారన్నారు.
బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ ఈ గురుకుల పాఠశాలలను ప్రారంభించారని ఆనాటి నుండి అదే స్ఫూర్తితో గురుకులాలు నడుస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే లక్ష్యంతో గురుకులాలు అని రంగాల్లో ముందంజలో ఉండాలని విద్యాసంస్థలను తీర్చిదిద్దుతున్నారన్నారు.
ఎం జె పి గురుకులాల్లో గతం నుండి వ్యక్తిగత పరిశుభ్రతను, డ్రెస్ కోడ్ పాటిస్తున్నారని, ఉదయం యోగ చేస్తున్నారని, ఇంకనూ మరింత మెరుగ్గా ఆచరించి అందరికీ ఆదర్శంగా తయారు కావాలనీ, ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఇదే విషయము పెద్దలకు కూడా తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ముస్తాబు కార్యక్రమంలో భాగంగా ఏకరూప దుస్తులను సజావుగా ధరించి, అద్దము దువ్వెనను వినియోగించుకొని చక్కగా తలను దువ్వుకొని చేతులు శుభ్రం చేసుకుని పాఠశాలకు హాజరు కావాలన్నారు.
రాష్ట్రంలోని 70 లక్షల మంది విద్యార్థులకు ముస్తాబు కార్యక్రమం అవగాహన కలిగిస్తున్నామన్నారు
విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యతగా భోజనం అందించడంతోపాటు మంచి ఏక రూపు దస్తులు కూడా సరఫరా చేశామన్నారు. పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు విద్యాసామాగ్రి తో కలిపిన సంచులను అందజేశామన్నారు ఇటీవల మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు లోకేష్ మాక్ అసెంబ్లీ నిర్వహించి అందులో విద్యార్థులను భాగస్వాములుగా చేశారన్నారు
తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా, మంత్రి స్థాయికి ఎదగగలిగానన్నారు
విద్యార్థులు కూడా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివారన్నారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు లోకేష్ విద్యాసంస్థల్లో అన్ని సౌకర్యాలు విద్యార్థులకు కల్పిస్తున్నారన్నారు. గురుకులంలోని విద్యార్థులందరూ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని, పదిమందికి తక్కువ కాకుండా ఐఐటీలో ఇచ్చిన మాట ప్రకారం నిలబట్టుకునే విధంగా పదిమందికి తక్కువ కాకుండా ఐఐటీలో స్థానం సంపాదించాలన్నారు. అదనపు తరగతి గదులు శాసనసభ్యులు కోరిన విధంగా అదనపు తరగతి గదులు మంజూరుకు సాసి నిధులు కేటాయించాలని ఇప్పటికే ప్రతిపాదించామని త్వరలో నిధులు విడుదలవుతాయి అన్నారు మంజూరు అవుతాయన్నారు.
అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి , గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి పి మాధవి లత, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వరరావు, మోపిదేవి ఎంపీపీ దుర్గారాణి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేశ్వరరావు, బిసి కార్పొరేషన్ ఈడీ రాజేంద్ర బాబు, బీసీ సంక్షేమ అధికారి రమేష్, ప్రిన్సిపాల్ వీరా రవి, వార్డెన్ సురేష్, సర్పంచు మేరీ రాణి పలువురు విద్యార్థులు పాల్గొన్నారు