ఆమె ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి..బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు అత్త..ఆమె పద్మభూషణ్ గ్రహీత, వేలకోట్ల అధిపతి సుధామూర్తి గారు ..అయినా ఎలాంటి ఆడంబరం లేకుండా
తిరువనంతపురంలో మంగళవారం నిర్వహించిన అట్టుకల్ వేడుకల్లో పొంగల్ వండుతూ సాధారణ వ్యక్తిలా వంట చేస్తూ కనిపించారు..
కొంతమంది అరకొరకె అలసిపోయి ఓపిక లేక తీరికలేక దేవుడికి దీపం పెట్టరు మన సంప్రదాయాలు పాటించరు ,తెలుగు రానట్టు మాట్లాడుతూ పిల్లలకి తెలుగు రాదు అని గొప్పగా చెప్తుంటారు చాలా మంది” చింకిరి బింకిరి దానికి సిరి వస్తే వంకర టింకర కాయలు ఏంటివి అని ఆడిగినట్టు” చాలా మంది ప్రవర్తించే ఈ రోజుల్లో ఇంత సింపుల్ గా, ఉన్నతంగా ఉండే ఈమెని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదూ?!
– ఎంబీఎస్ గిరిధర్‌రావు