Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో కొనసాగుతున్న నేతన్నల ఆత్మహత్యల పరంపర

కృష్ణాజిల్లా పెడన పట్టణంలో ఈరోజు ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు కాసిన పద్మనాభం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి.రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కార్మికులు వృత్తిపరంగా చేయూత లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏళ్ల తరబడి కార్మికుడికి మిగిలింది ఆత్మహత్య లేనా చిన్న చిన్న కుటుంబాలు రోగం వచ్చినా కుటుంబంలో ఎవరికి ఏ సమస్య
chenetha వచ్చినా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి చేసిన అప్పులు ఆత్మహత్యలకు దారి తీరుస్తున్నాయి. అంతేకాకుండా చేనేత మీద ఆధారపడిన కార్మికులు తయారు చేసిన వస్త్రాలు మార్కెట్లో పవర్లూమ్ వస్త్రాల పోటీ తట్టుకోలేక చేనేత కార్మికులు తయారుచేసిన 11 రకాల వస్త్రాలపై ఉన్న ఆంక్షలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అవ్వటం వలన, కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

దానికి తోడు మూలిగే నక్క మీద తాటికాయపడిన చందంగా చేనేత పై GST అమలు చేయటం వల్ల చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలు ధరలు పెరిగి మార్కెట్లో లో ఆమ్ముడుపోనీ పరిస్థితి ఏర్పడింది. ఈ విషమ పరిస్థితుల్లో చేనేత రంగం కునారిల్లుతోంది రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలు నివారించడానికి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలుకు పూనుకోవాలి.ఆత్మహత్య చేసుకున్న కాసిన పద్మనాభం కుటుంబానికి వెంటనే 25లక్షల రూపాయల మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండు చేస్తున్నాం.

– గంజి చిరంజీవి( టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి & రాష్ట్ర చేనేత నాయకులు)

LEAVE A RESPONSE