Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగానే ఛలో విజయవాడ

అనంతపురం : ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగానే చలో విజయవాడ కార్యక్రమం చేపట్టామని పీఆర్సీ సాధన సమితి నేత దివాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జీతాలు పెరగాయంటూ ప్రభుత్వం ఉద్యోగుల ఆత్మాభిమానం దెబ్బతీస్తోందన్నారు. గత్యంతరం లేకనే సమ్మెకు వెళ్లాల్సి వస్తోందన్నారు. విజయవాడ పురవీధుల్లో ఉద్యోగుల సత్తా చాటుతామన్నారు. జీతాలు పెరగాయని ప్రభుత్వం చెప్పడం అవాస్తవమన్నారు. మంత్రుల కమిటీ అవాస్తవాలు చెబుతూ ప్రజల్లో గందరగోళం రేపుతోందన్నారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఛలో విజయవాడతో పాటు అన్ని సంఘాలతో కలసి సమ్మెకు వెళ్తామని దివాకర్ రావు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE