ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ.. దేశం లోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ 33 బ్యాంకు లకు ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలతో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బిఐ) సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ సహా 20 ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకు డిబిఎస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లు ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సాధారణం గానే పని చేస్తాయి.నెఫ్ట్, ఆర్‌టిజిఎస్ తో పాటు చెక్ క్లియరెన్స్ వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయి..