వర్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్న పవన్

– వర్మ ఇంటికి పవన్

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గంలో ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ టిడిపి ఇంచార్జీ వర్మ ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గొల్లప్రోలు నుంచి పి. దొంతమూరు వరకూ అశేష జనం ఘన స్వాగతం పలికారు. జనసేన, టిడిపి శ్రేణులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వర్మ కుటుంబ సభ్యులు సత్కరించారు. ఆయన మాతృమూర్తి అలివేలు మంగ పద్మావతి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ ని, సుజయ్ కృష్ణ రంగారావునీ పవన్ కళ్యాణ్ సత్కరించారు.

Leave a Reply