ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన వైఖరిపై పద్మశ్రీ ఆగ్రహం.గురు బ్రహ్మ… గురు విష్ణు… గురు దేవో మహేశ్వరః అంటూ గురువును దైవంతో పోలుస్తారు.మన అజ్ఞాన చీకట్లను దూరం చేసి జీవితంలో విజయానికి బాటలు వేసే గురువులపై వైసీపీ ప్రభుత్వం దాడి చేయడం సిగ్గుచేటు.తమ హక్కుల కోసం పోరాడుతున్న టీచర్లపై లాఠీలు ఝుళిపించడం దుర్మార్గం.జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత టీచర్లను మద్యం షాపుల ముందు కాపలా ఉంచారు.మద్యం డబ్బుల కోసం టీచర్ల చేత మద్యం అమ్మించారు.నేడు పి ఆర్ సి పై ఆందోళన చేస్తుంటే పోలీసులతో కొట్టించారు.విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారంటే జగన్ పాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.చిన్నప్పుడు జగన్ టీచర్ చేతిలో దెబ్బలు తిని ఉంటే ఇలా అర్ధంలేని పనులు చేసేవారు కాదు.గత ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే విమర్శలు చేసి నేను అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ మంచి చేస్తానని నమ్మించారు.ఉపాధ్యాయులపై చెయ్యి చేసుకుని ముఖ్యమంత్రి జగన్ చేయకూడని పాపం చేశారు.ప్రభుత్వ ఆదాయం పెరిగిందని కాగ్ చెబుతుంటే డబ్బులు లేవని ముఖ్యమంత్రి, సీఎస్ చెప్పడం వెనుక అంతర్యం ఏంటి ?.కోవిడ్ సమయంలో చాలామంది ఉపాధ్యాయులు చనిపోయారు…వారి కుటుంబాలను ప్రభుత్వం గాలికి వదిలేసింది.ఉపాధ్యాయులను అరెస్టు చేయడం అంటే చదువుల తల్లిని అరెస్ట్ చేయడమే.ముఖ్యమంత్రి జగన్ పట్టింపులకు పోకుండా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి.