హక్కులపై పోరాడితే పోలీసులతో దాడి చేయిస్తారా?

Spread the love

ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మూర్ఖుడు:సీపీఐ.నారాయణ మండిపాటు

ఆంబోతులుగా తిరిగే వారిని సలహాదారులుగా నియమించుకున్నారు.చిత్తూరులో చదువుల తల్లులు మీద పోలీసులు దాడులు దారుణం. అక్షరాస్యులు మీద దాడులు చేయడం ప్రజాస్వామ్య మీద దాడులు చేసినట్టే. వారి హక్కుల కోసం పోరాడుతుంటే ఉద్యమాలను అణచి వేసేందుకు పోలీసులును వాడుకోవడం ఎక్కడి న్యాయం. వారికి ఇవ్వాల్సిన భత్యాలు ఇవ్వకుండా, ఆర్థిక పరిస్థితులు బాగోలేదని కుంటి సాకులు చెప్పడం సబబు కాదన్నారు. మరి సలహాదారు నిర్మించుకోవడానికి మాత్రం ఆర్థిక పరిస్థితులు బాగున్నాయా అని ఎద్దేవా చేశారు. ఇవ్వాల్సిన 5 డీ ఏలను పేర పెట్టుకొని ఇప్పుడు ఇచ్చేశామని చంకలు గుదదుకుంటున్న ప్రభుత్వ తీరు ,27 శాతం ఉన్న హెచ్ ఆర్ ఏ లను 23 శాతానికి కుదించి, ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ చదువుకున్నవాడా లేక మూర్ఖుడా అని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం తమ మొండి వైఖరిని విడనాడి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఉద్యమంలో భారత కమ్యూనిస్టు పార్టీ కూడా పాలుపంచుకుంది ఉందని హెచ్చరించారు.

Leave a Reply