– కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ
జంగారెడ్డిగూడెం లో కల్తీ సారా తాగి చనిపోయిన ఘటనలో ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ వేదికగా శవ రాజకీయాలు చేస్తున్నారు.ఆడ బిడ్డలకు అండగా ఉంటాను,సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఇచ్చిన హామీ ఏమైంది?
ఆడ పడుచులకు అన్నగా,తల్లులకు కొడుకుగా, పిల్లలకు మేనమామగా ఉంటాను అన్నావుగా జగన్.మరి ఇప్పుడు కల్తీ సారా తాగి చనిపోయిన కుటుంబాలకు ఏమి సమాధానం చెబుతావు? పైగా అన్నీ సహజమరణాలు అని చెప్పడానికి ముఖ్యమంత్రి జగన్ కి సిగ్గుండాలి.రాష్ట్రంలో గంజాయ్,డ్రగ్స్,కల్తీ సారా,మద్యం ఏరులై పారుతోంది
రాష్ట్రంలో మహిళల కన్నీరు ఆహుతిలా మారి జగన్ ప్రభుత్వాన్ని దగ్ధం చేస్తుంది.బొత్స, జగన్ అనునాయులు తయారు చేసే లిక్కర్,నాటుసారా విచ్చలవిడిగా అమ్మకానికి జగన్ సహకారం అందిస్తున్నాడు.
జగన్ సర్కార్ పై పోరాటంలో మహిళలు ఎక్కడా తగ్గేది లేదు.తాడేపల్లి వదిలి జగన్ బయటికి వస్తే రాష్ట్రంలో ఏమి జరుగుతోందో తెలుస్తుంది.