Suryaa.co.in

Andhra Pradesh

సైకోను తరిమికొట్టేందుకు సూపర్- 6

-నాది అంబేద్కర్ రాజ్యాంగం..జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం
-బీసీలకు వైసీపీలో న్యాయం జరగడం లేదని జంగా చెప్పారు
-రెండు నెలల్లో ప్రజలు జగన్ ను ఫుట్ బాల్ ఆడబోతున్నారు
-ఎస్.కోటను…అవినీతి కోటగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు మార్చాడు
-వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే
– శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట శంఖారావం సభలో యువనేత లోకేష్

క్రమశిక్షణకు…పట్టుదలకు మారు పేరు ఎస్.కోట ప్రజలు. ఉత్తరాంధ్ర గర్జించింది. ఈ గర్జనతో ప్యాలెస్ లో ఉన్న పిల్లి వణికిపోతోంది. పోరాటాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర. ఇప్పటిదాకా జగన్ ఉత్తరాంధ్ర ప్రజలతో ఆడుకున్నాడు…రాబోయే రెండు నెలల్లో ప్రజలు జగన్ ను ఫుట్ బాల్ ఆడబోతున్నారు. జగన్ మొన్నొక సభలో మాట్లాడుతూ… వైసీపీ నేతలు చొక్కాలు మడతపెట్టాలని చెప్పారు. కుర్చీ మడత పెట్టడానికి మా పసుపు సైన్యం సిద్ధంగా ఉందని చెప్పా.

నేను చెప్పిన దాంట్లో తప్పుందా…అవమానించానా? కానీ వైసీపీ నేతల మనోభావాలు దెబ్బతిన్నాయట. అరగంట మంత్రి అంబటికి బాధేసిందట. కుర్చీకాదు..సింహాసనం అని పదే పదే అంటున్నాడు. అది సింహాసనమే కానీ దానిపై కూర్చుంది శునకమే. ఆ శునకాన్ని తరిమికొట్టాలంటున్నా…ఒప్పుకుంటావా అంబటి? ఎన్నికల ముందు జగన్ నవరత్నాలు అన్నాడు..ఇప్పుడు అవి నవమోసాలు అయ్యాయి. ఎన్నికల ముందు ఎంతమంది బిడ్డలున్నా అమ్మఒడి ఇస్తానని అన్నాడు…ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్నాడు. ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా అన్నాడు…ఇప్పుడు వీధివీధినా మద్యం పారిస్తున్నాడు.

45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్ ఇస్తానని మాట తప్పాడు. మీరు పడ్డ కష్టాలు చూశాక చంద్రబాబు సూపర్-6 ప్రకటించారు. దీంతో జగన్ లో ఫ్రస్టేషన్ మొదలైంది. ఎక్కడికి వెళ్లినా తన పని అయిపోయిందని గ్రహించారు. భయం మొదలై సూపర్ – 6 ను కిచిడీ అంటూ జగన్ మాట్లాడుతున్నారు. మా సూపర్ – 6 ప్రజల కష్టాల్లోంచి వచ్చింది. ప్రజల కన్నీళ్ల నుండి వచ్చింది. సైకోను తరిమికొట్టేందుకు ఈ సూపర్- 6 వచ్చింది.

సూపర్ – 6 అంటే ఆంధ్రా భోజనం లాంటింది. సీమ రాగిసంగటి లాంటిది. అలాంటి పవిత్రమైన మేనిఫెస్టోను జగన్ విమర్శిస్తున్నారు. జగన్ కు ఓటమిని దేవుడు ముందే రాసిపెట్టాడు. వైసీపీ తరపున నిలబడేందుకు అభ్యర్థులుగా ఎవరూ ముందుకు రావడంలేదు. పక్క జిల్లాల నుండి తీసుకొచ్చి ఎంపీలుగా నిలబెడుతున్నారు. విశాఖ ఎంపీకి విజయనగరం నుండి బొత్స కుటుంబాన్ని, ఒంగోలు ఎంపీగా చిత్తూరుకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, నరసరావుపేట ఎంపీగా నెల్లూరుకు చెందిన బెట్టింగ్ స్టార్ అనిల్ కుమార్ ను తీసుకొచ్చారు.

గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు క్రికెటర్ ముందుకు వస్తే ఎంత డబ్బులిస్తావని, ఎప్పుడు ఇస్తావని వేధిస్తే పారిపోయాడు. కర్నూలు ఎంపీ సీటు సొంత మంత్రి గుమ్మనూరు జయరాంకు ఇస్తే వద్దు బాబో అంటున్నాడు. తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలానికి ఇస్తే నాకొద్దు బాబోయ్ అన్నాడు. 175 నియోజకవర్గాల్లో వైసీపీకి కనీసం 75 మంది కూడా దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల ముందు బీసీలను బ్యాక్ వార్డ్ క్లాస్ కాదు..బ్యాక్ బోన్ అన్నాడు. దళితుల దగ్గరకు వెళ్లి నేను మీ బిడ్డను అని జగన్ చెప్పుకున్నాడు. కానీ అధికారంలోకి వచ్చాక అహం పెరిగి బీసీలను వేధిస్తున్నాడు. దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తున్నాడు.

జగన్ పాలనలో జరిగింది సామాజిక న్యాయం కాదు…అన్యాయం. ఈమాట సొంత ఎమ్మెల్యేలే చెప్తున్నారు. 62 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలను ట్రాన్స్ ఫర్ చేశాడు..అందులో ఎక్కువ మంది బలహీన వర్గాలే. గురజాలకు చెందిన జంగా కృష్ణమూర్తి…యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి…బీసీ సెల్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనే బీసీలకు వైసీపీలో న్యాయం జరగడం లేదని చెప్పారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పద్మశాలి…ఆయన కూడా వైసీపీలో బీసీలను చిన్నచూపు చూస్తున్నారని చెప్పారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి కూడా బీసీ…ఆయను జగన్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పాడు.

దళితులంటే గౌరవం లేదని చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా అన్నారు. దళితు ఎమ్మెల్యేలంటే స్టిక్కర్ కు మాత్రమే పరిమిత చేస్తారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. బీసీలకు సంక్షేమ పథకాలు రద్దుతో పాటు 10 శాతం రిజర్వేషన్లు రద్దు చేశాడు. బీసీలపై అక్రమ కేసులు పెడతున్నాడు. 27 వేల మందిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపాడు ఈ సైకో జగన్. రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే 10వ తరగతి విద్యార్థి..వాళ్ల అక్కను వైసీపీ నేత కొడుకు వేధిస్తున్నారని అడిగితే అతన్ని కొట్టి, నోట్లో పేపర్లు కుక్కి కాళ్లు చేతులు కట్టేసి తగలబెట్టి చంపేశారు.

ఆ తగలబెట్టిన వైసీపీ నేత కొడుకు జైలు నుండి బయటకు వస్తే ఊరేగిస్తూ తీసుకొచ్చారు..ఇదీ వైసీపీ పాలనలలో బీసీలకు జరిగే న్యాయం. దళితులను కూడా వదల్లేదు. కరోనా సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ను వేధించి పిచ్చి వాన్ని చేసి చంపేశారు. సీతానగరంలో ఇసుక అక్రమ రవాణాపై మాట్లాడితే వరప్రసాద్ అనే యువకుడికి పోలీస్ స్టేషన్ లోనే గుండు కొట్టించారు. ఎమ్మెల్సీ అనంత బాబు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశారు. ఈ ఎమ్మెల్సీ సీఎం పక్కన కూర్చుంటాడు.

మీ లోకేష్ ను చూసినా జగన్ వణుకుతాడు. పాదయాత్ర ప్రారంభిస్తే నన్ను అడ్డుకునేందుకు జీవో – 1 తెచ్చాడు..మాట్లాడే మైక్ కట్ చేశాడు. నా కుర్చీ లాక్కున్నాడు. అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు. ఆనాడే చెప్పా…నేను తగ్గేది లేదు అని. ఇప్పుడు ఎర్రబుక్ పైనా కేసు పెట్టారు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయండని అడుగుతున్నారు. అందుకే జగన్ ను తాడేపల్లి పిల్లి అని అంటున్నాను. నాది అంబేద్కర్ రాజ్యాంగం..జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం. నేను స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివితే..నువ్వు పదవ తరగతిలో ప్రశ్నా పత్రాలు లీక్ చేసి పోలీసులతో కొట్టించుకున్నావు. నేను 25 వేల కి.మీ సీసీ రోడ్లు వేస్తే…నువ్వు కనీసం రోడ్లపై గుంతలు పూడ్చటం లేదు జగన్.

నేను టీసీఎల్, హెచ్.సీఎల్, బోహో, ఫాక్స్ కాన్ పరిశ్రమలు తెస్తే నువ్వు బూమ్ బూమ్, ఆంధ్రాగోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ మద్యం కంపెనీలు తెచ్చావ్. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. గ్యాస్, పెట్రోల్, డీజల్, ఇంటిపన్ను పెంచాడు..ఆఖరికి మద్యం ధరలు కూడా పెంచి బాదుడే బాదుడే. పీల్చేగాలికి కూడా జగన్ పన్ను వేస్తాడు. వాలంటీర్లు ఇళ్లకు వచ్చి టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు తొలగిస్తారని చె చెబుతున్నారు. ఎన్టీఆర్ సీఎం అయినప్పుడు ఈ వాలంటీర్లు పుట్టలేదు. ఏపీకి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రెండ రూపాయలకే కిలోబియ్యం, రూ.50లకే పవర్ అందించారు.

చంద్రబాబు వచ్చాక డ్వాక్రా సంఘాలు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్, అన్నదాత సుఖీభవ, బీమా లాంటి 100 సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. కటింగ్ మాస్టారు అన్నాను కదా…అన్నా క్యాంటీన్, పెళ్లి కానుక, పండుగ కానుక ఇలా వంద సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. వైసీపీ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. అబద్ధం ప్రపంచాన్ని చుట్టుకుని వచ్చేలోపు నిజం గడపదాటదు అని అంటుంటారు..వైసీపీవి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. జగన్ కు ఒక జబ్బుంది..నిజాలు చెప్తే తల వందముక్కులు అవుతుంది. ప్రజలు పడే కష్టాలు చూసే సూపర్ -6 ను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం. యేటా జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. ఉద్యోగాలు వచ్చేదాకా నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తాం. చదువుకునే ప్రతిబిడ్డకు యేటా రూ.15 వేలు ఇస్తాం…కుటుంబంలో ఎంతమంది బిడ్డలున్నా ఇస్తాం. 18-59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు రూ.1500, యేటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మహిళలకు కల్పించబోతున్నాం. అన్నదాత కింద రైతులకు పెట్టుబడి సాయంగా యేటా రూ.20 వేలు అందించబోతున్నాము.

ఈ సూపర్ సిక్స్ జగన్ బంతిని సిక్స్ కొడుతుంది. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్. ఉత్తరాంధ్రను మూడు కుటుంబాలకు అప్పగించారు..బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రపై పడి పందికొకుల్లా దోచుకుంటన్నారు. జగన్ విజయనగరం జిల్లాకు 50 హామీలు పాదయాత్రలో ఇచ్చాడు. భోగాపురం విమానాశ్రయం, రామతీర్థం ప్రాజెక్టు, గోస్తావని-చంపావతి నదుల అనుసంధానం, రామభద్రపురం- పెద్దగడ్డ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చేయలేదు. పాలేరు నదిపై డ్యాం కడతాన్నాడు..కనీసం ఇటుక కూడా వేయలేదు. స్వర్ణముఖి, చిట్టిగడ్డపై బ్రిడ్జి కడతానని కట్టలేదు.

విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది టీడీపీనే. జిల్లాలో రోడ్లు, తాగు, సాగునీటి ప్రాజెక్టులు, నిరుపేదలకు సొంత ఇళ్లు కట్టింది టీడీపీనే. పట్టణ పేదలకు అన్ని హంగులతో టిడ్కో ఇళ్లు కట్టించాం. ఎస్.కోటలో రూ.2వేల కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు నిధులు కావాలని దబాయించేవారు…కానీ లలిత కుమారి వచ్చి బాబూ పలానా రోడ్డు పెండింగులో ఉంది అని చెప్పి నిధులు మంజూరు చేయించుకునేవారు.

రైతు బజార్లు, అన్నాక్యాంటీన్లు కూడా ఏర్పాటు చేశాం. 500 ఎకరాల్లో గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేసి ప్రహారీలు కూడా కట్టాం..కానీ ఈ ప్రభుత్వంలో పనులు ఆగిపోయాయి…ఏమైంది కూడా మీకు తెలుసు. పెందుర్తి-అరకు రోడ్డును 6 లైన్ల రోడ్డుగా చేస్తానని చెప్పాడు..కానీ పట్టించుకోలేదు. జామీ దగ్గర జూనియర్ కళాశాల, కొత్తవలస దగ్గర డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తానని చెప్పాడు…చేయలేదు. 300 పడకల ఆసుపత్రి అన్నాడు… కనీసం 3 ఇటుకలు కూడా వేయలేదు.

బీమశింగి షుగర్ ఫ్యాక్టరీని డబ్బులిచ్చి తెరిపిస్తానని చెప్పాడు..మనం ఇచ్చిన రూ.13కోట్లు లాగేసుకుని షుగర్ ఫ్యాక్టరీని చంపేశాడు. పుణ్యగిరిగుడి అభివృద్ధిపైనా మాట మార్చాడు. టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపించండి..అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎస్.కోటను…అవినీతి కోటగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు మార్చాడు. శ్రీనివాసరావు అవినీతి పరుడు. కొండ పక్కన పచ్చటి భూములు లాక్కున్నాడు. రైతులను భయపెట్టి భూములు కబ్జా చేశాడు. కొండకు గుండుకొట్టి ఇళ్లు కట్టుకున్నారు. జగన్ రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటే ఈయన రూ.50 కోట్లతో కట్టుకున్నాడు.

బాధితుడు సుంకర పైడన్న నన్ను కలిసి ఆధారాలు కూడా చూపించాడు..కోర్టు ఆదేశాలు ఇచ్చినా బాధుతున్ని గెంటేశాడు. ప్రజల సొమ్ముతో పెద్దబంగ్లా కట్టుకున్నాడు. ఎమ్మెల్యే కన్నుపడితే దొంగ పత్రాలు సృష్టించి భూములు లాక్కుంటున్నారు. ఆయన బంధువు రమేష్ నాయుడు ఇసుకను వదలకుండా దోచుకుంటున్నాడు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.1,000 ఉండే ఇసుక ఇప్పుడు రూ.5 వేలు అయింది. ఇందులో రూ.4 వేలు ఎమ్మెల్యే, బొత్స, సీఎంకు వాటాగా వెళ్తోంది.

ఎస్ఐ పోస్టుల్లో కూడా అవినీతికి పాల్పడుతున్నారు. కరోనా సమయంలో పరిశ్రమల దగ్గరకు వెళ్లి డబ్బులు వసూలు చేశాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు జరిగాయా? పేదల భూములు కొట్టేశారా? ఎప్పుడూ ఇలాంటి ఘోరాలు లేదు. నీతి నిజాయితీకి మారు పేరు టీడీపీ. టీడీపీ-జనసేన అభ్యర్థిని ఎస్.కోటలో గెలిపించండి. ఇక్కడే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. పెండింగులో ఉన్న తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.

ఎస్.కోటను విశాఖపట్నం జిల్లాలో కలుపుతాం. ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకొస్తాం..స్థానికులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. గిరిజన ఫ్రాంతాలకు ఫీడర్ అంబులెన్సులు ఇచ్చాం. గిరిజనులకు ఈ ప్రభుత్వం రద్దు చేసిన 17 సంక్షేమ పథకాలు తిరిగి ప్రారంభిస్తాం. గిరిజనులు ఉన్నచోటే సొంతిళ్లు కట్టిస్తాం.

పెందుర్తి-అరకు రోడ్డును 4 లైన్ల రోడ్డుగా మార్చుతాం. ఇప్పుడున్న రోడ్లపై ప్రయాణిస్తే ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. అందుకే సీఎం జగన్ రాష్ట్రంలోని రోడ్లపై ప్రయాణించకుండా గాల్లో తిరుగుతున్నాడు. పది కి.మీలకు కూడా హెలికాప్టర్ లో వెళ్తారు. రోడ్లను బాగు చేసే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారు. పార్టీ బలం కార్యకర్తలే. అహర్నిశలు పార్టీ కోసం పాటుపడుతున్నారు. పసుపు జెండా చూస్తేనే మనకు నూతన ఉత్సాహం వస్తుంది. చంద్రబాబు రా..కదలిరా అంటే పరుగెత్తుకెళ్లే ఉత్సాహం మనలో ఉంది.

15 ఏళ్ల సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పని చేశారు. తిత్లీ తుఫాను, హుద్ హుద్ తుఫాను సమయంలో ఇక్కడే ఉన్నారు. మా ఇంట్లో శ్రీమంతం జరుగుతున్నా పది నిమిషాలే ఇంట్లో ఉండి ఇక్కడికి వచ్చారు. అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేశారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. ప్రజల కోసం పని చేసినందుకు ఆయన్ను 53 రోజులు జైల్లో పెట్టారు. నాకు ఆనాడు అండగా నిలబడింది పవన్ కళ్యాణ్. ధైర్యంగా ముందుకు నడవాలని చెప్పారు. .మనకు సమయం ఉంది ఇక 52 రోజులే..ఈ 52 రోజుల్లో సూపర్-6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే.

LEAVE A RESPONSE