– ప్రజలను ఇబ్బందిపెట్టేలా నడిరోడ్డుపై వైసీపీ సభలు
– ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు
ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు శాంతియుతంగా సభలు నిర్వహిస్తామంటే అనుమతి ఇవ్వని ప్రభుత్వం వైసీపీ నేతల సభలకు మాత్రం ఆగమేఘాల మీద ఒప్పుకోవడం అప్రజాస్వామికం. ప్రతిపక్షాల సభలకు అనుమతులు నిరాకరిస్తూ అక్రమ అరెస్టులు, గృహనిర్భంధాలు, నిరంకుశ చర్యలతో వేధింపులకు గురిచేస్తూ వైసీపీ నేతలకు మాత్రం నడిరోడ్డు మీద అనుమతులు ఇస్తున్నారు. ఆసరా, సిద్ధం అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టేలా, ట్రాఫిక్ జామ్ చేసేలా అనుమతులు ఎలా ఇస్తారు? రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ లేదు.
వైసీపీ రాఫ్తాడులో చేపట్టిన సభకు నేషనల్ హైవే పక్కన ఏ విధంగా అనుమతిస్తారు? నిత్యం వేలాదిమంది బెంగుళూరు`హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన సభకు అనుమతిచ్చి లక్షల మందిని ఇబ్బంది పెట్టడం సైకోతత్వానికి నిదర్శనం. సభకు వారం రోజుల ముందునుంచే జాతీయ రహదారి మీద కూడా ఆంక్షలు విధించడం దేనికి సంకేతం?
రైతులు తమ ఉత్పత్తులను బెంగుళూరు, హైదరాబాద్ మార్కెట్లకు తరలించలేని పరిస్థితి నేడు నెలకొంది. ఫిబ్రవరి 18న మీటింగ్ ఉంటే 11 నుంచే ఆంక్షలు విధిస్తారా? తెలుగుదేశంపార్టీ సభలకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వని అధికారులు ఈ సభలకు ఎందుకు ఇస్తారు? వైసీపీ నేతల ఆగడాలు ఇంకెన్ని రోజులో సాగవు.. కౌంట్‌డౌన్ మొదలైంది.