– ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రుల బృందం
అనంతపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 10న అనంతపురం పర్యటనలో భాగంగా విచ్చేస్తున్న సందర్భంగా స్థానిక జిఎంఆర్ ఇంద్రప్రస్థ శ్రీనగర్ కాలనీ వైపు ఉన్న ప్రాంతంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ కార్యక్రమం రాష్ట్రస్థాయి సభ కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పనులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ , ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లు సంయుక్తంగా సభా వేదిక ఏర్పాటు, ఇతర పనులను పరిశీలించారు.
అనంతరం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారథి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, సింగనమల శాసన సభ్యురాలు బండారు శ్రావణి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ , అహుడా ఛైర్మెన్ వరుణ్, రాష్ట్ర నాయకులు కే. రవీంద్ర(నాని), కిలారి రాజేష్, చిలక మధుసూదన్ రెడ్డి జనసేన జిల్లా అధ్యక్షులు సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా బిజెపి అధ్యక్షులు కొనకండ్ల రాజేష్, రాష్ట్ర మీడియా ప్రతినిధి బి. వి . వెంకట రాముడు తో పాటు పలువురు కూటమి ముఖ్య నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
సభ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతోకార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఇబ్బందులు లేకుండా బాధ్యత యుతంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పార్కింగ్, భోజన వసతి, వేదిక ఏర్పాటు, భద్రత, ట్రాఫిక్ సడలింపు చర్యలు, మంచినీటి సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య పనులు తదితర మౌలిక వసతుల కల్పన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రణాళిక బద్ధంగా పనులను పూర్తి చేయాలని మంత్రులు సభా కార్యక్రమాల నిర్వహణ బృందానికి సూచించారు.