-వైసీపీ ఐదేళ్ల పాలనలో దోపిడీ
-పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి
ప్రజలు టిడిపి జనసేన బిజెపి కూటమికి మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని తమ ప్రభుత్వం ఏర్పడగానే నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక చేత్తో పథకాలు అందిస్తూనే మరోచేత్తో పన్నుల రూపంలో ప్రజల నుంచి దోపిడీ చేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 38 39 44 45 డివిజన్లలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. బ్యాలెట్ నమూనాపై అవగాహన కల్పిస్తూ సైకిల్ కమలం గుర్తులకు ఓటేయాలని పిలుపునిచ్చారు.
పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానని మరోసారి స్పష్టం చేశారు. నియోజవర్గ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.రానున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికి ఓటెయ్యాలన్నారు. కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి బుద్ధా వెంకన్న టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరాఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గొల్లపూడి మాజీ సర్పంచ్ బొమ్మసాని సుబ్బారావు బోండా నారాయణరావు టిడిపి డివిజన్ అధ్యక్షులు రేగళ్ల లక్ష్మణ్ బొడ్డుపల్లి శ్రీనివాసరావు పితాని పద్మ బిజెపి డివిజన్ అధ్యక్షులు పచ్చిపులుసు వెంకటప్రసాద్ జనసేన డివిజన్ అధ్యక్షులు సాయి శరత్ జనసేన డివిజన్ అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి మాజీ కార్పొరేటర్ గుండారపు హరిబాబు బిజెపి టిడిపి జనసేన ఓటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.