Home » విధ్వంసానికి ఓటు వేసి నష్టపోయాం

విధ్వంసానికి ఓటు వేసి నష్టపోయాం

-తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది
-ల్యాండ్, శ్యాండ్, మైన్, వైన్ ద్వారా కోట్లు కొట్టేసిన -దుర్మార్గుడుకి గుణపాఠం చెబుదాం
-గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే సమర్ధుడు చంద్రబాబును సీఎం చేద్దాం
-ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ, కైకలూరు రోడ్ షోలో నారా రోహిత్

ఉమ్మడి కృష్ణా జిల్లా:- తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ చేపట్టిన మన కోసం మన నారా రోహిత్ పర్యటన మూడో రోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగింది. మొదటి నందిగామ నియోజకవర్గంలో పర్యటించి రోడ్ షో నిర్వహించిన నారా రోహిత్‌కు కూటమి నేతలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. పూలమాలలతో మళిళలు నారా రోహిత్‌ను సత్కరించారు. అనంతరం చందర్లపాడులో నిర్వహించిన బహిరంగ సభలో నారా రోహిత్ పాల్గొన్నారు.

చందర్లపాడు బహిరంగ సభలో నారా రోహిత్ మాట్లాడుతూ…
“అభివృద్ధి చేసే నాయకుడు కాదని విధ్వంసం చేసే రాక్షసునికి ఓటేసి గత ఎన్నికలలో మనం మోసపోయాం.. ఓటేసిన తప్పుకి ఐదేళ్లు శిక్ష అనుభవించాం.. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఓటు అనే ఆయుధం ద్వారా మనకు వచ్చింది.. ఒక్కసారి ఓటేసినందుకే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలతో పోటీపడే స్థాయికి చంద్రబాబు తీసుకువేళ్ళారు.. కానీ నేడు చిన్న రాష్ట్రాలతో కూడా జగన్ రెడ్డి నిర్వాకం వలన పోటీ పడలేక పోతున్నాం.. ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలస పోతున్నాం.

రాష్ట్రంలో అవినీతి, దోపిడి, అరాచకాలు తప్ప ఉద్యోగ కల్పన లేదు.. చంద్రబాబు ఎంతో కష్టపడి తీసుకొచ్చిన కియా, లూలు కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేసిన కీచకుడు జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో ల్యాండ్, శ్యాండ్, మైన్, వైన్ మాఫియాతో వేల కోట్లు దోచుకున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.. కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మన భూములను కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్న కబ్జాదారుడు జగన్మోహన్ రెడ్డి.. మరోసారి అవకాశం ఇస్తే మన ఆస్తులు మన సొంతం కాకుండా పోతాయి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉత్తిత్తి బటన్‌లు నొక్కి ప్రజలను మోసం చేస్తున్నాడు.

వైసిపి పాలనలో అన్ని వర్గాలపై దాడులు.. వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు వరప్రసాద్ అనే వ్యక్తికి శిరోముండనం చేశారు.. మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్‌ను పిచ్చోన్ని చేసి హత్య చేశారు.. పెళ్లి కానుక, చంద్రన్న కానుకలు, దళితులకు విదేశీ విద్య వంటి ఎన్నో సంక్షేమ పథకాలను దూరం చేశారు.. పేదవారికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను ఆపేశారు. అవన్నీ తిరిగి మళ్లీ అమలు చేయాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. మీరందరూ మే 13న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య, ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్నికి ఓటు వేసి గెలిపించాలి” అని నారా రోహిత్ కోరారు.

హాస్య నటుడు రఘు మాట్లాడుతూ : సునామి చూడలేదు, మిడతల దండు చూడలేదు, కానీ పసుపు సైన్యం కనబడుతుంది.. చందర్లపాడు పసుపు సైన్యముగా మారిపోయిందని అన్నారు.. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నిరుద్యోగులకు ఉద్యోగం లేదు, తాగునీరు లేదు, వ్యవసాయానికి సాగునీరు లేదు, అవసరమా ఇలాంటి అసమర్థ ప్రభుత్వము.. రాష్ట్రాన్ని బాగు చేసే సమర్థవంతమైన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం.. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించమని కోరారు.

కైకలూరులో నారా రోహిత్ రోడ్ షో…
అనంతరం కైకలూరులో నారా రోహిత్ రోడ్ షో నిర్వహించారు. నారా రోహిత్ ఎన్నికల ప్రచారంలో అడుగడున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ… “కైకలూరులో ఏదైనా అభివృద్ధి జరిగిందా అంటే అది కామినేని శ్రీనివాస్ మంత్రి, ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లోనే జరిగింది. 2019లో అరాచక పాలన ఏర్పడ్డాక అభివృద్ధి నిలిచిపోయింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభివృద్ధి చేసిందేది లేదు. రోడ్లు దారుణంగా ఉన్నాయని ప్రజలు ఈ దుస్థితికి రావడానికి కారణం జగన్ రెడ్డి ప్రభుత్వమే.

నిలిచిపోయిన అభివృద్ధి తిరిగి గాడిలో పడాలన్నా, యువతకు ఉద్యోగాలు, ఉన్నత విద్య అందాలన్నా చంద్రబాబు సీఎం అయితేనే సాధ్యం. అందుకు ప్రజలు చేయాల్సిందల్లా తెలుగుదేశం, జనసేన బలపరిచిన బిజెపి కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్ధి కామినేని శ్రీనివాస్‌కు కమలం గుర్తుపైన, జనసేన, బిజెపిలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంటు అభ్యర్ధి పుట్ట మహేష్ కుమార్ యాదవ్‌కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించుకోవాలి” అని పిలుపునిచ్చారు. ఈ రోడ్డు షోలలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కన్వీనర్ అట్లూరి నారాయణరావు, తాడికొండ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply