– బిజెపి బిఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేసి ఎనిమిది స్థానాలు గెలుచుకుందని మాట్లాడటం ప్రజలను అవమానపరిచినట్లే
– ఎన్ రాంచందర్ రావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నేడు తేదీ 18 డిసెంబర్ 2025న హైదరాబాద్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేశాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ స్వతహాగా కార్యకర్తల కష్టంతో ప్రజల అండతో రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున సర్పంచులను, వార్డు సభ్యులను గెలుచు కోవడం జరిగింది. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రెండు ఒకటి కాకపోతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నేను కొట్టినట్టు చేస్తా. నీవు ఏడ్చినట్టు చెయ్యి అన్నట్టు బిఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పై ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని తిరస్కరించడం ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు లోక్ సభ ఎన్నికలలో ఎవరి తరపున ప్రచారం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి సమర్ధించడం ముఖ్యమంత్రి దివాళా కోరుతనానికి నిదర్శనం. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై మరోసారి అసెంబ్లీలో చర్చిస్తాం అనడానికి రిజర్వేషన్లను దాటవేయడానికి చేస్తున్న కుట్రలో భాగమే.
రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాలతో బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటైనప్పటికీ బిజెపి పై అబండాలు వేస్తూ ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో తెలంగాణ ప్రజలు అబద్ధాలు సైతం నమ్ముతారని నమ్మకంతో అబద్దాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు రెఫరండమని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు రావడంతో, నేడు పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి బిఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేసి ఎనిమిది స్థానాలు గెలుచుకుందని మాట్లాడం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్లే.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న సీట్లు సున్నా అనే విషయం మర్చిపోయి మాట్లాడడం వారి జ్ఞాపకశక్తిని గుర్తు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ రెండు స్థానాలను గెలుచుకుంది. అందులో కాంగ్రెస్ పార్టీ చెందిన స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది.