జగన్ అడ్వకేట్ గారు చాలా ఆశగా వెళ్లారు. “అయ్యా, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లు లడ్డూ మీద విమర్శలు చేస్తున్నారు, సీబీఐ వీటిని ఆపలేకపోతోంది.. మీరైనా ఆపండి” అని వేడుకున్నారు.
కానీ కోర్టు క్లియర్ గా చెప్పేసింది—మీరు వేసిన పిటిషన్ కేవలం మీ తప్పులను కప్పిపుచ్చుకునే “డిఫెన్స్” లాగా ఉందే తప్ప, అందులో అసలు విషయం లేదని. డిఫెన్సుకు వెళితే రివర్స్ మాడు పగిలేట్టు మొట్టింది.
“విచారణ పెండింగ్లో ఉంది కదా, మేం జోక్యం చేసుకోం” అంటూ సీజేఐ గారు ఇచ్చిన ‘డిస్మిస్’ ఆర్డర్, వైఎస్సార్సీపీకి ఒక గట్టి షాక్. అంటే, సీబీఐ విచారణ సాకుతో విమర్శలను ఆపలేరని తేలిపోయింది.
దేవుడి ప్రసాదం విషయంలో నిజాలు బయటకు వస్తుంటే, వాటిని “ప్రొవొకేటివ్ స్టేట్మెంట్స్” (రెచ్చగొట్టే వ్యాఖ్యలు) అని ముద్ర వేయాలని చూసిన ప్రయత్నం బెడిసికొట్టింది.
సుబ్రమణ్య స్వామిని పంపి విచారణకు అర్హత లేదని చెప్పించుకుని వచ్చి వారాలు గడవలేదు. కొత్తగా మళ్లీ కోర్టులో కేసు వేసి ప్రత్యర్థుల నోళ్లు మూయించాలనుకున్న జగన్ ప్లాన్ ‘డిస్మిస్’ అయ్యింది. ఇప్పుడు సీబీఐ విచారణ తరువాత ఏర్పాటైన ఏకసభ్య కమిటీ విచారణతో పాటు, ప్రజల విమర్శలు కూడా ఎదుర్కోవాల్సిందే !
