అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019 లో చేసిన రాజ్యాంగ సవరణ ను సుప్రీం కోర్టు 4-1 మెజారిటీ తో సమర్థించింది. అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని విచారించి, సోమవారం చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. ఈ పది శాతం రిజర్వేషన్ల ను ఆంధ్ర ప్రదేశ్ లోని కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య వంటి ‘అగ్రకులాల్లో’ని పేద వారికి విద్యా, ఉద్యోగ వ్యవహారాల్లో కల్పించవలసి ఉంటుంది.
ఈ అగ్ర వర్ణాల్లో – జనాభా సంఖ్య రీత్యా కాపులు ఎక్కువ సంఖ్య లో ఉన్నారనే కారణం గా… వారికి 5 శాతం కేటాయిస్తూ గతం లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ 10 శాతం రిజెర్వేషన్లే అమలులోకి రాలేదు అంటున్నారు. బహుశా, ఈ రిజెర్వేషన్ల రాజ్యాంగ సవరణ చెల్లుబాటు ను సుప్రీం కోర్టు లో 30 మందికి పైగా సవాలు చేసినందున; సుప్రీం తీర్పు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదురు చూస్తూ ఉన్నదేమో తెలియదు.
ఇప్పుడు, సుప్రీం అడ్డంకి తొలగిపోయినందున, ప్రభుత్వం… ఈ రిజెర్వేషన్ ను అమలు చేస్తుందని ఆశించవచ్చు. వచ్చే ఎన్నికల లో కాపు సామాజిక వర్గం ఒక కీలక పాత్ర పోషించడం ఖాయంగానే కనపడుతున్నది. జనసేన నేత పవన్ కళ్యాణ్ క్రియాశీలకం కావడం ; వైసీపీ కాపు నేతలు సంఘటితం కావడం కూడా… వచ్చే ఎన్నికల్లో కాపు ప్రాముఖ్యత ని తెలియచేస్తున్నది. ఈ నేపధ్యం లో ఈ 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణ పేదలకు లభించాల్సి ఉన్న రిజర్వేషన్ల సదుపాయా న్ని అమలు చేయడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ కాపులు, ఇతర అగ్ర వర్ణాల అభిమానాన్ని విశేషం గా చూరగొనే అవకాశం ఉంది.