Suryaa.co.in

Political News

సుష్మా అంటేనే చరిష్మా!

మగమహారాజుల స్వరాజ్యంలో
ఆమె సుష్మాస్వరాజ్..
దిగ్గజాలతో నిండిన
కమలం పార్టీలో
ఆమె స్వర్ణకమలం..
ప్రమాదం వస్తే ప్రమోద్..
అక్కర ఏర్పడినప్పుడు
అద్వానీ..
వాటంగా వాజపేయి..
ఈ అందరినీ మించి
ఏ సందర్భంలోనైనా
ఇట్టే నెగ్గే మహారాజ్ఞి
సుష్మాస్వరాజ్ఞి..
దుర్మార్గంపై మండే అగ్ని..!

సుష్మా అంటేనే చరిష్మా..
వారసత్వం కోరని నాయకత్వం..
తనలోంచి తానుగా
ఉద్భవించిన నాయకి..
సోనియమ్మ దృష్టిలో
నిఖార్సయిన ప్రతినాయకి..
సురుచిర సుందరవేణి
మణిమయ మంజుల వాణి
బిజెపి సిగలో
అందమైన పూబోణి..!

అద్భుతమైన ప్రసంగాలు
ఆకట్టుకునే వ్యాసంగాలు
కెరీర్ ఆది నుంచి సత్సంగాలు
ఇవే సుష్మ..తనకు తానుగా
రాసుకున్న రాజ్యాంగాలు..
అవే ఆలంబనగా రాజకీయాలు..
అందుకే ఆమె ఏం చేసినా
అందులో ఆకట్టుకున్న రాజసాలు..!

రాజకీయాన్ని మించిన కీర్తి
ఆమె మూర్తీభవించిన
హిందూ స్త్రీమూర్తి..
ఆకట్టుకునే రూపు
అందమైన కట్టు..బొట్టు..
మాటుందే..అదిట్టే
ఎవరి పనైనా పట్టు..
సమస్య ఎంతటిదైనా
సుష్మ దిగితే చిటికెలో
పరిష్కారం..
అలా అయింది
ఆమె మహానాయికగా ఆవిష్కారం..
మొత్తంగా ఆమె
అందానికి..అభినయానికి..
మాటకు…మంచికి..
ఓ పెద్ద నమస్కారం..!

అలాంటి ఓ దేవత..
తాను దిగివచ్చిన దివికి
మరలిపోవాలని
తానే తొందరపడిందో..
ఇక చాలు వచ్చేయి
ఆ సభ నుంచి నా సభకు
అంటూ దేవుడే రభస చేశాడో
అంతటి అందం అకస్మాత్తుగా
ఆంతర్ధానం అయిపోయింది..
మరలిరాని లోకానికి
తరలిపోయింది సుష్మా..
ఎప్పటికీ మరిచిపోలేని
ఓ చరిష్మా..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE